ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
*శ్లోకం*
*వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం౹*
*వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం౹*
*వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం౹*
*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*
_" *శివస్తుతి - 6* "_
యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు, బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు, భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన *శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి