8, అక్టోబర్ 2023, ఆదివారం

ఇజ్రాయెల్ లో జరుగుతున్నది మనకు ఒక పాఠం

 ఇజ్రాయెల్ లో ఎక్కువగా యువతులను, టీనేజ్ అమ్మాయిలను బంధీలుగా ఎత్తుకెళ్లారు పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు. నిజాం పాలనలో నాటి తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల ముఠా చేసిన వికృత చేష్టలు, కాశ్మీర్ లో హిందూ పండిట్ల పై తీవ్రవాదులు జరిపిన మారణహోమాన్ని గుర్తుకుతెచ్చేలా నిన్నటి నుండి ఇజ్రాయెల్ లో హమాస్ తీవ్రవాదులు చేస్తున్న ఈ దారుణాలు ఉన్నాయి. 


ఇప్పుడు ఈ యువతులను ఆ రాక్షస మృగాలు ఎంత మానసిక, శారీరక హింసకు గురిచేస్తాయో అనేది ఊహించుకుంటేనే మన గుండె వేగం పెరుగుతుంది. భారత్ లో గత వేయి సంవత్సరాల చరిత్రలో సైతం భారతీయ రాజుల పై దురాక్రమణదారులు యుద్ధాలకు దిగిన అనంతరం మన రాజులు ఓడిపోతే, రాజుతో సహా సైనికుల వరకు ఎందరినో శిరచ్ఛేధం చేసి ఆ రాజ్యం లో ఉండే రాణితో సహా ఎందరినో మహిళలను, యువతులను ఎత్తుకెళ్లి బంధీలుగా పెట్టుకుని వారిని హింసించి వారిని భోగ వస్తువు వలె వాడుకుని అనంతరం బజారులో అమ్మాకానికి పెట్టడం లాంటి రాక్షస క్రీడ ఆడేవారు.


ఇజ్రాయెల్ లో జరుగుతున్నది మనకు ఒక పాఠం. మన ఇంట్లో ఆడవారు, బాలికలు ఉన్నారు వాళ్ల భద్రత కోసం మనం, రేపు వారికి ఏ హాని కలుగకుండా ఉండాలంటే ప్రస్తుతం ఏం చేస్తున్నాం అనేది స్వయం విశ్లేషణ చేస్కోవాలి. బతుకమ్మ చీర ఉచితంగా వచ్చిందనో, ఆసరా పింఛన్, కళ్యాణ లక్ష్మీ, ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చి దేశ భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఇజ్రాయెల్ లో జరిగింది రాబోయే రోజుల్లో మనం ఉండే ప్రాంతాల్లో సైతం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, కాస్త ఆలోచించండి 🙏

కామెంట్‌లు లేవు: