రామాయణమ్ 348
...
అన్నా ! నీ కిష్టమైన మాటలు చెప్పేవారు ఎల్లవేళలా లభింతురు.
కానీ ప్రియము కాకపోయిననూ హితవు చెప్పువారు అరుదు.
.
రాముడు నిన్ను చంపుచుండగా నేను చూడజాలను అందుకే వెళ్ళిపోతున్నాను ఇక సెలవు అని ఆకాశమున నిలచి విభీషణుడు పలికెను.
.
వెనువెంటనే ముహూర్తకాలములో విభీషణుడు రామలక్ష్మణులు ఉన్నచోటికి వచ్చెను.
.
ఆకాశములో మెరుపు వలే మెరుస్తూ నిలుచొని యున్న విభీషణాదులను క్రిందున్న వానరులు చూసిరి.
.
ఎవడీ రాక్షసుడు ? మనలను చంపుటకు వాని అనుచరులతో వచ్చినాడా ఏమి !అని సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వారితో అనెను.
.
సుగ్రీవుని మాటలు వెలువడగనే అందరూ ఒక్కసారిగా మద్దిచెట్లను ,పర్వతములనుచేతపుచ్చుకొన్న వారై ,రాజా అనుజ్ఞ ఇమ్ము ఇప్పుడే వారిని నేలకూల్చెదము అని పలికిరి.
.
వానర సేనలో పుట్టిన కోలాహలము గమనించి క్రిందకు దిగకుండగనే పెద్ద కంఠస్వరముతో ,నేను రావణుని తమ్ముడు విభీషణుడను ,మా అన్న చేసిన చెడ్డపనికి ,అది తగదు అని నేను హితవు పలుకగా ఆతడు నన్ను అవమానించి వెడలగొట్టినాడు .నేను నా భార్యాపుత్రాదులను విడిచి రాముని శరణు జొచ్చినాను .
.
నా రాక మహానుభావుడైన రామునికి ఎరిగించండి అని బిగ్గరగా పలికెను.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి