31, డిసెంబర్ 2022, శనివారం

అతడు డ్రైవరు 

అతడు డ్రైవరు 

ఒక కారు నడిపే చోదకుడిని కారు డ్రైవరు అని, ఒక లారీ నడిపే చోదకుడిని లారీ డ్రైవరు అని, అదే జీపుని నడిపే డ్రైవరుని జీపు డ్రైవరు అని పిలవటం మనం సాధారణంగా చూస్తూవుంటాము. అంతేకాదు మారుతి కారు, మహేన్ద్ర కారు, టాటా కారు అని ఇంకా కారుకు ముందు పెట్టి డ్రైవరు అని పిలుస్తారు. మారుతి కారు డ్రైవరు, మహేంద్ర కారు డ్రైవరు ఆలా ఇంకా కొన్ని సందర్భాలలో యజమాని పేరుతొ అంటే రామారావు కారు డ్రైవరు, కృష్ణారావు కారు డ్రైవరు ఇలా.  అతని ఎలా పిలిచినకాని నిజానికి ఆటను మాత్రం డ్రైవరు. 

ఒక డ్రైవరు చక్కగా తాను విధినిర్వహణ చేస్తున్న కారును చక్కగా నడిపి యజమాని అవసరానుకూలంగా అతనిని సరైన సమయానికి అతను కోరుకున్న ప్రదేశాలకు చేర్చుతూ, కారును మంచిగా చూసుకుంటూ ఉంటే ఆ డ్రైవరు ఆ యజమాని మెప్పుని పొంది అతని జీతంలో వృద్ధి మరియు ఇతర ఎలావన్సులు యజమాని నుండి పొందగలడు, అదేవిధంగా కారుని సరిగా చూసుకోక కారుకు ప్రమాదాలను కలగచేస్తూ, యజమానికి కారు ఎక్కాలంటేనే భయం వేసే విధంగా కారును నడిపితే ఆ కారు డ్రైవరు యజమాని కోపానికి గురి అయి వెంటనే ఉద్యోగంనుండి తొలగించటమే కాకుండా యజమాని అతని నుండి నష్టపరిహారం కారే విధంగాకూడా పరిస్థితులు  ఏర్పడవచ్చు. వీటన్నిటికీ కారణం డ్రైవరు తన విధులను నిర్వహించే విధానం మీద ఆధార పడివున్నదని వేరే చెప్పనవసరం లేదు.  మనం ఉపయోగించే ఏ వస్తువు అయినా మనం దానిని వాడే విధానం మీద ఆధార పడివుంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఇద్దరు మిత్రులు ఒకే రోజు చెరొక కారు వకే మాడలుది కొన్నారనుకోండి ఆ ఇద్దరు కారులు వకే విధంగా పనిచేయాలని లేదు.  ఒకని కారు ఎలాంటి లోపంలేకుండా చక్కగా నడవ వచ్చు ఇంకొకని కారు కొన్న మరుసటి రోజే చెడిపోయి షడ్డుకు వేళ్ళ వచ్చు. కాబట్టి దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే తయారుచేసే వాడు రెండు ఒకేమాదిరిగా చేసినా కూడా దేని మన్నిక దానిది. మానవుడు ఎంతో నయపుణ్యంతో తయారుచేసిన వస్తువు ఎలా పనిచేస్తుందో చెప్పలేము, కానీ సరిగా పనిచేయటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు నిపుణులు తీసుకుంటారు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మిత్రమా నీవు నేను అని దేనిని అంటున్నావో అది నీ శరీరంలో అందులో వున్న నీవే నీవు అంటే అర్ధం కాలేదు కదా అదేమిటంటే నేను అనుకునే శరీరాన్ని నియంత్రించే దివ్య చెతన్యం మాత్రమే నీవు కానీ ఏరకంగా ఐతే ఒక కారు డ్రైవరు ఆ కారుతో కలిపి తన ఉనికిని చెపుతాడో అదేరకంగా నీవు నీ శరీరంతో కలిపి నీ ఉనికిని చెపుతున్నావు.  అంతవరకూ అయితే పరవాలేదు చాలామంది తమ ఉనికే శరీరం అని భావించి శరీరంలోని నిఘాడమైన దివ్యమైన, సుద్ద చేతన్యాన్ని మారుస్తున్నారు.  దానితో వారి శరీరానికి అనేక విధాలుగా బంధాలను, సుఖాలను, పొందాలని ప్రయత్నిస్తూ ఒక అసమర్ధపు కారు డ్రైవరు తానూ కారుని సరిగా నడపలేక ప్రమాదాలకు గురుచేసినట్లుగా శరీరంతో అనేక పాపకృత్యాలను  సలుపుతున్నారు. దాని ఫలితంగా బాధలను, కష్ఠాలను, ఇబ్బదులను, అనుభవిస్తున్నారు.  అదే సత్యాన్ని తెలుసుకున్న సాధకుడు తన శరీరం కేవలం శుద్ధ చెతన్యమైన తనకు ఆశ్రయమిచ్చిన ఒక కారు లాగా భావించి ఏరకంగా ఒక సమర్థుడైన కారు డ్రైవరు లాగా శరీరాన్ని నియంత్రించి పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలితాన్ని పొంది దాని వల్ల సుఖాలను, ఆనందాలను అనుభవించి చివరకు మోక్షపదాన్ని చేరుతున్నాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: