10, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


నారదా! ఏమి చెప్పమంటావు. ఎంతని చెప్పమంటావు? మాయాదేవి త్రిగుణస్వరూప

అఖిలాధార. సర్వజ్ఞ. సర్వసమ్మత. అజేయ. అనేకరూప. సర్వవ్యాపిక. చూడాలనుకుంటున్నావుగదా! సరే.

గరుత్మంతుణ్ణి అధిరోహించు. ఇద్దరం కలిసివెడదాం. అజితాత్ములకు కనిపించని మాయామహాదేవిని

నీకు చూపిస్తాను. చూసిన తరవాత విషాదానికి లోనవుతావేమో. మనస్సుని దృఢపరచుకోవాలి సుమా!

అని విష్ణుమూర్తి నన్ను హెచ్చరించి, గరుత్మంతుణ్ణి స్మరించాడు. గరుడుడు ప్రత్యక్షమయ్యాడు.

ఇద్దరమూ అధిరోహించాం. వాయువేగంతో బయలుదేరాడు. మహారణ్యాలూ దివ్యసరస్సులూ పవిత్ర

నదీనదాలూ పర్వతశ్రేణులూ పల్లీపత్తనగ్రామాలూ ఆశ్రమాలూ వాపీతటాకాలూ నానావిధ పక్షి మృగజాతులూ

- అన్నింటినీ తిలకిస్తూ దాటుకుంటూ కాన్యకుబ్జ సమీపస్థలం చేరుకున్నాం. అక్కడ ఒక అతిలో

సుందరమైన సరస్సు కనిపించింది. నిండా వికసించిన రంగురంగుల పద్మాలు. హంసకారండవ

చక్రవాకాది జలపక్షి సమూహాల కోలాహలం. తుమ్మెదల ఝంకారాలు. స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న

మధురజలం, క్షీరసముద్రోదకంతో పోటీపడుతుందనిపించింది. ఆ దివ్యసరోవరాన్ని చూసి శ్రీ మహావిష్ణువు

- ఇందులో స్నానం చేసి కాన్యకుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దామని గరుత్మంతుణ్ణి కిందికి దిగమన్నాడు.

గరుడుడు ఆ సరోవర తీరంలో మెల్లిగా వాలేడు. శ్రీహరి ముందుగా దిగి, నా చూపుడువేలు అందుకుని

నన్ను దింపాడు. సరోవర సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చెట్టువీడలో

విశ్రమించాడు. నారదా! ముందు నువ్వు స్నానం కానియ్యి, తరవాత నేను చేస్తాను - అన్నాడు. సరేనని

నేను సరోవరంవైపు చూపులు నిగుడించాను. సజ్జనుల హృదయాల్లాగా నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి.

పంకజపరాగాలతో పరిమళిస్తున్నాయి

కామెంట్‌లు లేవు: