🍃🪷 మన భవిష్యత్ కోసం మన నాయకులు ఇవ్వబోయే ఉచిత పధకాలు 🤪🤦♂️
*01. 'గొంతులోకే గోరుముద్ద పథకం' తో ప్రతి ఇంటికీ వండిన వంటకాలు.*
*02. 'చేతిలో చత్వారం' పేరుతో అందరికీ స్మార్టు ఫోన్లిచ్చి ఫ్రీ ఇంటర్నెట్టు, ఫ్రీ ఓటీటీ చానెల్సు.*
*03. 'లివరులోకే లిక్కరు' పథకంతో ఇంటింటికీ సారా పైపులు.*
*04. 'మస్తిష్కానికే మత్తు' పేరుతో ప్రజలందరికీ మత్తు పదార్ధాల సప్లై.*
*05. 'ఇంటికీ ఒంటికీ' పథకం పేరుతో ఉచిత ఇల్లు, ఫర్నీచరు, పవరు సప్లై.*
*06. 'బద్దకస్తులకి బట్టలు' పేరుతో ఆర్నెలలకో రెండు జతల ఉచిత బట్టలు.*
*07. 'నీడ బతుకులకి ఎండతోడు' పథకంతో ఇంట్లో ఉండి బోరుకొట్టేసిన బతుకులకి ఉచిత విదేశీ పర్యటన.*
*08. 'పాదాల వద్దకే పుణ్యం' పేరుతో భగవంతుడ్నే గుమ్మం దగ్గరకి తెచ్చే పథకం.*
*09. 'చదువెందుకు చంకనాక' పథకం పేరుతో చదవకపోయినా 99% మార్కులతో మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు.*
*10. 'పిడకలపై పడకలు' పేరుతో వైభవోపేతంగా ఉచిత అంతిమయాత్రా వేడుకలు.*
*11. వృద్ధ యువతకి బద్దకరత్న బిరుదులు ప్రధానం చేయబడును. కాబట్టి మీ ఖరీధైన ఓటుని మా పార్టికే అమ్ముకోవాలని ప్రార్ధన.*
*ఇట్లు మీ నాయకుడు.😊😁🫣*
🍃🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి