శుభోదయం!🙏
చ మ త్కా రం !
కవులమాటలేకాదు.కవిత్వభాషవంటబట్టినవారుకూడా చమత్కారభాసురంగా మాటలాడగలరు.ఆమాటలవెనుక అర్ధం యెవరికర్ధం అవుతుందీ?ఆభాషతెలిసినవారికే! కాదుకాదు ఆభాషలో మర్మాలను తెలుసుకున్నవారికికూడా ఆచమత్కారం బోధపడుతుంది.
ఈపద్యం చిన్నదే కానీ చమత్కార రరంజితమై,సరసుల హృదయరంజకంగా మారింది.
ఇదిగో ఆపద్యం ఇదేనండీ!
క:చవిగొనఫలములుఁగొననా?
చవిజూచిన పండ్లురాలు; చక్కగబొమ్మా!!
కవినేను, కనులఁ గనవా?
కవి వైనచొ ,చంకనాకు, గంటంబేదీ?
పూర్వం కవులకు సంఘంలో మంచిగౌరవముండేది.వారెక్కడికి వెళ్ళినా అందరూ వారిని గౌరవించి అడిగినవి సగౌరవంగా సమర్పించేవారు.
ఒకకవిగారు అరటిపండ్లకోసం బజారు వచ్చారు.కొట్టుదగ్గనిలబడ్డారు.
పాపం వచ్చేటప్పుడు గంటం తాటియాకులు మరచారు.(అవి వారు కవులని సూచించేగుర్తులు.)
దుకాణదారునితో,
"చవిజూడపండ్లుగొననా?"అన్నారు.
రుచిచూచినచ్చితే పండ్లుకొంటానయ్యా!రుచికి పండ్లు తీసికోనా?అన్నారు.
దానికాదుకాణదారు,
"చవిజూచిన పండ్లురాలు చక్కగబొమ్మా?"-అన్నాడు.
రుచికోసంచేతులేస్తే పళ్ళురాలుతాయి.చక్కగాపో!అన్నాడు.(ఒకఅర్దంపళ్ళురాలుతాయి అనితిట్టినట్టు.మరొకఅర్ధం గెలకున్నపళ్ళురాలిపోతాయి కెలకవద్దు.అని)
కవిగారికికోపంవచ్చింది.
"కవినేను కనులగనవా?"- అన్నారు.
ఓఆసామీ యెవరనుకుంటున్నావు నన్ను నేను గవిని,ఆమాత్రంమర్యాదతెలియదా? అని;
దుకాణదారుకూడా తక్కువవాడుకాదుమరి,
"కవివైనచొ చంకనాకు, గంటంబేదీ?" అన్నాడు.(పోవయ్యా నీవుకవివైతే ఏమిగొప్ప చంకనాకవయ్యా?అనిదూషించినట్టు.ఒకఅర్ధం.మరోఅర్ధం.తమరుకవియైతే చంకలో ఆకులు ,గంటమూ కనబడవేం?
అనిమరోఅర్ధం)
"చూశారా?శ్లేషసాయంతో కవితనమాటలలో రెండర్ధాలను జోడించాడు.
ఇదీ ఈకందంలోని చమత్కారం!!
ఇదంతా వక్రోక్తి వైభవమే!
మీకు నచ్చితే రేపు మరోటి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి