డబుర ధనలక్ష్మి కథలు 💐
కథ: టెక్నాలజీ
కాలేజ్ లో అడుగు పెట్టింది సరయు.
చూడ చక్కని అందమైన అమ్మాయి.
తండ్రి పెయింటర్ .తల్లి గృహిణి.
తల్లిదండ్రుల కు ఒక్కగానొక్క కూతురు.
ఆ రోజు
సీనియర్స్ కొందరు సరయును వింతగా చూస్తూ వెళ్తున్నారు.
కొందరు అబ్బాయిలేమో వెకిలిగా నవ్వుతూ తన వంక అదోలా చూస్తూ వెళ్తున్నారు.
సరిగ్గా అప్పుడే కిషోర్ బైక్ పై వస్తూ సరయు దగ్గరగా వచ్చి బైక్ ఆపాడు
"సరయు.ఇప్పటికే నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ వాట్సాప్ ఇన్ స్టాగ్రాం ల్లో పోస్ట్ చేసేసా.
నువ్వు స్నానం చేసే వీడీయోలు.
డ్రెస్ చేంజ్ చేసుకునేవి.ఇలా ఒకటా రెండా.
నీ హాస్టల్ మేట్ నుండి తీయించా.
ఇప్పటికే వైరల్ చేసేసా
నన్నే కొడతావా.
నేను నిన్ను కొట్టను నీ జీవితంపై కొడతాను.
ఇక నీ జీవితం మొత్తం నాశనం. ఇప్పటికే బట్టల్లేకుండా నీ ఫోటోలు వైరల్ అయిపోయాయి.ఇక ఏం చేస్తావ్. ఉరేసుకుని చావడమే నీకు శరణుం" అంటూ కసిగా వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు.
చేతుల్లో మొహం దాచుకుని ఏడవడం మొదలు పెట్టింది సరయు.
వేగంగా హాస్టల్ కి వెళ్ళి లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళింది.
ఆ రోజు రాత్రి మొబైల్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేసింది.
కిషోర్ అకౌంట్ లో తన ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు. ఇంకా ఎన్నో.
కన్నీళ్ళాగలేదు. వెంటనే ఇంట్లో పంటచేను కోసం తెచ్చిన పురుగుల మందు బాటిల్ అందుకుంది . తాగి తన జీవితాన్ని ముగించేద్దాం అనుకుంది.
సమయానికి గమనించిన సరయు తల్లి అన్నపూర్ణ బలవంతంగా ఆ పురుగులమందు డబ్బాను దూరంగా విసిరి కొట్టి సరయు ను ఓదార్చి విషయం తెలుసుకుంది.
వెంటనే భర్తకు ఫోన్ చేసింది
సరయు తండ్రి రమణ విషయం తెలిసి కృంగిపోయాడు అయినా కూతురికి ధైర్యం చెప్పాడు. రమణ అక్క కొడుకు సరయుకు బావ వరసైన సాత్విక్ ను పిలిపించాడు.
సరయు చిన్నప్పుడే సాత్విక్ భార్య అని పెద్దలు పేరు పెట్టుకున్నారు. సాత్విక్ సరయులకు కూడా ఒకరంటే ఒకరికి ప్రేమే
విషయం తెలుసుకున్న సాత్విక్ లో ఆవేశం ఎక్కువైంది. కానీ సాత్విక్ మామ రమణ " ఆవేశం వద్దురా. ఆలోచించి ఏ పనైనా చేయాలి.ఇవతల ఆడపిల్ల జీవితం" అంటూ రమణ సాత్విక్ ను తీసుకుని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
పోలీసులు కిషోర్ ను అరెస్ట్ చేశారు.
కిషోర్ తల్లిదండ్రులు అవమానం గా భావించారు. కిషోర్ కు కూడా అక్క ఉంది. పోలీసులు దేహశుద్ది చేశారు. కిషోర్ కుటుంబానికి ఇంటా బయటా అవమానాలు. వీధిలోని ఆడపిల్లల తల్లిదండ్రులు కిషోర్ కుటుంబాన్ని అసహ్యంగా చూడటం మొదలు పెట్టారు.
కాళ్ళబేరానికొస్తుందనుకున్న సరయు ఇలా తనని తనకుటుంబాన్ని వీధి పాలు చేస్తుందని కిషోర్ ఊహించలేదు.
పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. కిషోర్ సరయు జోలికెళ్ళనని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు.
కిషోర్ కుటుంబం సరయు కుటుంబాన్ని క్షమాపణలు కోరింది.
సరయు కుటుంబం ఆ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయారు.
తన గతం తెలియని చోట సరయు కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.
అయినా సరయు జీవితం క్షణం క్షణం గండం లా అనిపించ సాగింది.
పక్కనున్న ఎవరైనా గుసగుసలాడుకున్నా తన వైపు అనుమానంగా చూసినా సరయు వాళ్ళు చూస్తున్నది తన మార్ఫింగ్ ఫోటోలే మో అని భయపడిపోయేది.
అదే సమయంలో పెద్దలు సరయు కు సాత్విక్ తో పెళ్ళి జరిపించారు.
సాత్విక్ కు సరయు అంటే ఎనలేని ప్రేమ.
భార్య సరయు భయాన్ని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాడు.
సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు.
సరయు తోటి కోడలు భావన సరయు స్థితికి ఎంతో చలించిపోయింది.
ఒకరోజు భావన "సరయూ. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. టెక్నాలజీ పెరిగిపోయింది.
టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి లాంటిది.
మంచికి వాడొచ్చు .చెడుకు వాడొచ్చు.
ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తలు ఉండాలి.సోషల్ మీడియా సైట్ లలో వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయకూడదు.
తెలియని వ్యక్తుల పరిచయాల కు దూరంగా ఉండాలి.
మనం తినే ఆహారం కడుపులోకి వెళ్ళినట్టు
మనతో ఉండే స్నేహాల ప్రభావం మాటలు మన మనసులోకి వెళ్తాయి.కాబట్టి మంచి స్నేహాలు చేయాలి.
మనం ఎంత ఎదిగినా ఆడపిల్లలం ఆడపిల్లలమే.
ఎందుకంటే ఓ మగవాడు ఓ అమ్మాయి ని రేప్ చేసినా సమాజంలో ధైర్యంగా తిరగగలుగుతాడు.
అదే ఆడది తన తప్పు లేకపోయినా అత్యాచారానికి గురైతే అందరూ వెలివేసినట్టు అపవిత్రం అయినట్టు చూస్తారు.అన్నిటికంటే నీచం ఆదరించాల్సిన తోటి మనుషులు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తారే తప్ప ఆదరించరు.
పైగా అవమానిస్తారు.
ఎవడో తన రాక్షసానందం కోసం నిన్ను చెడుగా ప్రొజెక్ట్ చేస్తే దానికి నువ్వు అంతలా బాధపడిపోవడం ఏంటి.
పోనీ. అందరు ఆడపిల్ల ల్లాంటిదే నీ శరీరం కూడా.
చూస్తే చూడనీ. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయే శరీరం.
.పైశాచిక ఆనందం పొందనీ.
ఆడపిల్ల లంటే సమాజంలో ఇంకా చిన్నచూపే.
అందంగా ఉంటే ప్రేమలంటూ వెంట పడతారు.ఒప్పుకోక పోతే హత్యలు చేస్తున్నారు.
ఒప్పుకుంటే బరితెగించి తిరుగుతోందని నిందలు వేస్తారు.
ఒంటరిగా దొరికితే అత్యాచారాలు చేస్తున్నారు.
ఏ చట్టానికి ఏ శిక్ష లకూ భయపడటం లేదు.
ఆడపిల్లల ప్రాణాలంటే మరీ ఇంత చులకనా
ప్రస్తుతం నువ్వు అశక్తురాలివై అతడిని శిక్షించలేక పోవచ్చు.
కానీ దేవుడు అనే వాడొకడు న్నాడు.
ఏదో రోజు దేవుడు అతడికి వేసే శిక్ష భయంకరంగా ఉంటుంది.
మంచి మనసు కార్చే కన్నీటికి ఎంతో విలువ శక్తి ఉంటాయి.
ప్రపంచంలో ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకు.
నిన్ను వేలెత్తి చూపే వాళ్ళంతా ఎవరు. ఎందుకు పనికొస్తారు.
నీ ప్రపంచం నీ కుటుంబం.
మరి నీ కుటుంబం అంతా నీకు వెన్నుదన్నుగా ఉన్నపుడు ఎవరో ఏదో అనుకునే మాటలకు నీకు బాధెందుకు.
మన కుటుంబం లో అందరం నీ మంచి గురించే ఆలోచిస్తాం.
చెప్పడం మర్చిపోయా.
త్వరలో మీ బావ నాచే "బొటిక్" మొదలు పెట్టిస్తున్నారు.
నువ్వు నేను పార్టనర్స్. సాత్విక్ కూడా ఒప్పుకున్నాడు.
ఇద్దరికీ చేతినిండా పని.
పనికిరాని ఆలోచనలకు చెక్ పెట్టేద్దాం.
ఏమంటావు" అంది.
సరయూ "థాంక్యూ అక్కా .అలాగే" అంది.
నెల రోజుల్లో "భావనా సరయు బొటిక్ " ప్రారంభం అయింది.
ఇక సరయు పూర్తి పనిలో పడింది.
నిజానికి సరయు ఆలోచనలో ఎంతో మార్పు.
సమాజం చూసే చూపు లో ఎందుకు మార్పు కోరుకోవాలి.అనుకుంది.
ముఖ్యంగా మార్పు సరయు "ఆలోచనల్లో" వచ్చింది.
ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించడం మానేసింది.
ఇది తన జీవితం. తను సంతోషంగా జీవించాలి అనుకుంది కాబట్టి తనను బాధ పెట్టే విషయాలను బలవంతంగా మర్చిపోయింది
మనోవిజ్ఞాన శాస్త్రంలో దీనినే "దమనం"అంటారు.
బలవంతంగా మరచిపోవడం
తనను బాధించే మనుషులకు స్నేహాలకు దూరంగా ఉంటూ తన కుటుంబం తో సంతోషంగా గడపడమే ముఖ్యం అని భావించింది.
ఓ మంచి సంతోషకర జీవితానికి శ్రీకారం చుట్టింది.
ఆడపిల్ల లో ఉండాల్సింది "ఆత్మ విశ్వాసం"
ఆడపిల్ల లకు కావాల్సింది
ప్రేమించే భర్త
ఆదరించే కుటుంబం
ప్రోత్సహించే స్నేహితులు
వెన్నంటి ఉండే ఆత్మీయులు
Save girls@
సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు
రచన:
డబుర ధనలక్ష్మి 💐✍️
హిందూపురం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి