7, జులై 2020, మంగళవారం

భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ

భగవంతుడు ద్వాపరయుగమునందు శ్రీకృష్ణునిగా అవతరించి, ధర్మమును పరిరక్షించి, కంసాది అనేక దుష్ట రాక్షసులను సంహరించి, శిష్టులను పరిరక్షించెను. అలాగే అర్జునుడిని నిమిత్తముగా చేసికొని సమస్తమానవజాతికీ
సకలవేదసారమైన భగవద్గీతను ఉపదేశించెను.

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః ।
పార్థో వత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతం మహత్॥

అనే శ్లోకము -“శ్రీకృష్ణుడనే గోపాలకుడు ఉపనిషత్తులనే గోవులనుండి మనుష్యులకు ముక్తిమార్గమును చూపెడి భగవద్గీత అనే అమృతసమమైన క్షీరమును మొదట అర్జునుడనే దూడకు అందించి, అనంతరం సమస్తలోకమునకూ అనుగ్రహించెను” అని గీతయొక్క వైశిష్ట్యమునుతెలియజేస్తోంది. అందువల్లనే ఇటువంటి మహోపకారమును చేసిన శ్రీకృష్ణపరమాత్మను “కృష్ణం వందే జగద్గురుం” అని స్తుతిస్తాము. సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్ట కారిణే ।
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే॥

సచ్చిదానంద స్వరూపుడు, సకలవిధమైన కష్టములను పరిహరించెడివాడు, వేదాంతవేద్యుడు, సద్గురువూ అయిన శ్రీకృష్ణునికి నమస్కారము.

కామెంట్‌లు లేవు: