6, నవంబర్ 2023, సోమవారం

పరమశివుడు నాట్యం

 


శ్లోకం:☝️

*నృత్తావసానే నాటరాజ రాజో*

  *ననాద ఢక్కాం నవ పంచవారం |*

*ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్*

  *ఏతద్విమర్శే శివ సూత్రజాలం ||*


భావం: పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు (నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14) పర్యాయాలు మ్రోగించగా, ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి, వ్యాకరణ సూత్రాలుగ రచించెను. ఈ సూత్రాలే ‘మాహేశ్వర’ సూత్రాలుగా పిలువబడుతున్నాయి. ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.


*వాక్యకారం వరరుచిం*

  *భాష్యకారం పతంజలిం |*

*పాణినిం సూత్రకారం చ*

  *ప్రణతోస్మి మునిత్రయం ||*


భావం: అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’🙏

కామెంట్‌లు లేవు: