నేడు కవికోకిల శ్రీ గుర్రం జాషువా మహాకవి గారి
వర్థంతి.....
తే.గీ|| షాజహాన ప్రభుని స్వప్న జగతి యందు
జాషువా కవి జీవిత సమరమందు
ఘనత దీపించు నొక స్వర్ణఘట్టమౌను
రమ్యమౌ తాజమహలు నిర్మాణ సృష్టి.
తే.గీ||షాజహానుని యెద కళాస్వాద తృష్ణ
గబ్బిలమున నభాగ్యు రక్తాశ్రు గాథ
తలచి ఫిరదౌసి దయనీయ దైన్య చరిత
జాషువా కావ్యదృష్టి కంజలి ఘటింతు...
సీ|| భవ్య భావావేశ పటిమకూపిరి వోసి
యుత్తేజమున కొక్క యూపు నిచ్చి
సంఘ సంస్కార వాసనల నల్గడ జల్లి
దేశభక్తికి వీర తిలకమద్ది
తియతియ్య నుడి తెల్గుతీరు తీయములకున్
జాతీయములకు లక్ష్యముగ నిల్చి
తరతరాలకు వెల్గు తన మూర్తి తెల్గు భా
వుక కోటి కనుదిన స్ఫూర్తి నించి
తే.గీ||శాంత వీరోజ్జ్వల కృపా మహాద్భుతముల
చిత్ర రసరాజ్య శిఖరాగ్ర సీమలందు
విడిసి కొలువున్న కవిశేఖరుడవు, గుండె
తలుపు దట్టిన జాతి వైతాళికుడవు
🙏🙏🙏🙏🙏🙏
ఎస్.ఏ.టి.ఎస్..ఆచార్య,
హైదరాబాద్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి