దశరథాత్మజ శతకము (54)
సీ.భరతాగ్రజా ! రామ ! భానువంశ ప్రదీప !
నిరతమ్ము నినుగొల్తు నిగమవేద్య !
తారకమంత్రమ్ము తలచిన మాత్రాన
పాపముల్ నశియించి పరము గల్గు
కౌసల్యనందనా ! కమనీయ గుణధామ !
కైవల్యమిచ్చినన్ గావు మయ్య
భూమిజపతిరామ ! భువనైక మోహనా !
కోసలాధిప రామ ! కూర్మి కొలుతు
తే.నీదునామమ్ము దలచియు న్నిచ్చ లందు
బడసె కైవల్య పదము నా భక్త శబరి
భక్తితో నిన్ను గొల్చిన ముక్తి గల్గు
దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !
జయలక్ష్మి పిరాట్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి