మహాభారత ప్రశస్తి
సీ. ధర్మస్వభావమ్ము దర్శించువారలు
సమ్మతింతురు ధర్మశాస్త్ర మనుచు
పరమాత్మ జీవాత్మ లెరిగిన వారలు
దర్శింతు రిద్ది వేదాంత మనుచు
నీతివిషయమందు నేర్పున్నవారలు
సన్నుతింతురు నీతిశాస్త్ర మనుచు
కవనమున్ జెప్పెడి కవిముఖ్యు లందఱు
గణియింతు రిది మహాకావ్యమనుచు
లక్ష్యంబు లెఱిగిన లాక్షణికవరులు
నేర్తృ సకలలక్ష్యనిధి యటంచు
నైతిహాసిక బుద్ధులమరిన పండితు
లరయుదు రిది యితిహాస మనుచు
సకల పురాణముల్ చదివెడి వారలు
రహి చూతురు బహుపురాణ మనుచు
ఆ. ఇట్లు సర్వ జనుల యిష్టంబు కొఱకును
విష్ణుసన్నిభుండు విమలమౌని
వివిధ తత్త్వ విషయ వేద్యుండు వ్యాసుండు
భారతమును జేసె భాసురముగ
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి