24, జులై 2024, బుధవారం

24-07-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*24-07-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


ఆప్తుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా  పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు.  వ్యాపారాలలో అంచనాలు  అందుకోవడానికి  చేసే  ప్రయత్నాలు సఫలమౌతాయి. దైవ చింతన పెరుగుతుంది. 

---------------------------------------

వృషభం


సన్నిహితులతో  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు వేగంగా  పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు  కొనుగోలు చేస్తారు. వృత్తి  వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

---------------------------------------

మిధునం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి  ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు  నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


కుటుంబ విషయంలో ఆలోచనలు  స్థిరత్వం లోపిస్తుంది. బంధు  మిత్రులతో కలహా సూచనలున్నవి.  జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు  వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

సింహం


ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.  చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన పనులు  సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో  పరిచయాలు విస్తృతమౌతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వ్యాపార విస్తరణ  ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అదనపు  బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

---------------------------------------

తుల


వృధా ఖర్చుల విషయంలో   పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత  మానసిక చికాకు కలిగిస్తుంది. ప్రారంభించిన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో వ్యయ  ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో  విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

ధనస్సు


ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. బంధు మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు  లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

మకరం


బంధువుల ప్రవర్తన  కొంతచికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన  పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.

---------------------------------------

కుంభం


ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి.  సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారములలో  స్వంతనిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తిఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మీనం


సన్నిహితులతో  మాట పట్టింపులుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన  పనులలో జాప్యం కలుగుతుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

కామెంట్‌లు లేవు: