సహజ సిద్ద వైరాగ్యం అంత తేలిగ్గా పుట్టదు. ఎంతో సాధన చేస్తేనే వైరాగ్యం క్షణం కూడా నిలువదు. "భజ గోవిందం" అన్నది ఓ నిరంతర వ్యాపకంగా ఉంటే..ఎప్పటికో ఎన్ని జన్మలకో పరమాత్మ అనుగ్రహంతో వైరాగ్యం సహజ సిద్ధంగా కలుగుతుంది. అప్పటి వరకూ ఎం చెయ్యాలి??అన్నీ వొదిలేయాలా?? అలా చెప్పలేదు శంకరుల వారు. సహజంగా వైరాగ్య భావం కలిగే వరకూ ధర్మ ఆచరణ చేయాల్సిందే. అదెలా? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పారుగా..అన్నీ ఈయనకే అర్పించాలి. బృందావనంలో గోపికల్లా. వారు అన్ని పనులూ చేసుకుంటారు..అంతటా కృష్ణుడునే చూస్తారు. అన్నీ వొదలమంటే సంధ్యావందనం, దేవతార్చన...వొదిలేసి భజన చేయమని కాదు. దేహమున్నంత వరకూ ధర్మాన్ని ఆచరిస్తూనే..క్రమంగా వైరాగ్యాన్ని అలవరచుకోవాలి. వైరాగ్యం తోనే ఆత్మ విచారం సాధ్య పడుతుంది. భగవద్గీత లో స్వామి చెప్పినదే.. భజగోవిందం శ్లోకాలలో శంకరుల వారు చెప్పారు. ధర్మాన్ని విడిచిపెట్టమని వొదిలేయమని గోవిందుడు చెప్పలేదు. శంకరులు చెప్పలేదు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి