శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
అని ఆ జలాలను మెచ్చుకుంటూ నా మహతీవీణనూ, మృగాజినాన్ని తీసి శ్రీహరి సన్నిధిలో
ఉంచి క్రొత్త రేవుగదా అని సంశయిస్తూ మెల్లగా సరోవరంలోకి దిగాను. కాళ్ళూ చేతులూ కడుక్కుని, శిఖ
విదిల్చి, ఆచమించి ఇంకొంచెం లోతుకి వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను. విష్ణుమూర్తి గట్టున కూర్చుని
అంతా తిలకిస్తూనే ఉన్నాడు. అలా మునిగానో లేదో నాకు పురుషరూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది.
ఆశ్చర్యంతో కళవళపడ్డాను. రవ్వంత తేరుకుని గట్టువైపు చూద్దునుగదా శ్రీహరి నా వీణనూ కృష్ణాజినాన్నీ
తీసుకుని గరుత్మంతుణ్ణి అధిరోహించి తుర్రుమన్నాడు.
సాధూవామివ చేతాంసి జలాని నిర్మలాని చ
సురభీణి పరాగైస్తు పంకజానాం విశేషతః
.
నారద తాళధ్వజుల పరిణయం
సర్వాలంకారభూషితమైన స్త్రీరూపం రాగానే నాకు పూర్వపు పురుషరూప స్మృతి క్షణంలో
మటుమాయమయ్యింది. జగన్నాథుణ్ణి మర్చిపోయాను. మహతినీ కృష్ణాజినాన్నీ మరిచిపోయాను.
మోహినీరూపంతో సరోవరం నుంచి బయటకి వచ్చాను. గట్టుమీద నిలబడి ఆ సరస్సును
మరొక్కసారి పరిశీలనగా చూశాను. స్వచ్ఛంగా నిర్మలంగా ఏమీ ఎరగనట్టే ఉంది. ఈ వింత ఏమిటి చెప్మా
అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను. ఏమి చెయ్యాలో ఎటుపోవాలో తోచక దిక్కులు చూస్తున్నాను.
తాళధ్వజ మహారాజు అటువైపు వస్తూ కనిపించాడు. గజాశ్వరథబృందాలు వెంటరాగా తానొక
రథంమీద విజయం చేస్తున్నాడు. కోడెవయస్సులో సువర్ణ దివ్యాభరణ విభూషితుడై మళ్ళీ పుట్టిన మన్మథుడిలావిరాజిల్లుతున్నాడు.
గజాశ్వరథబృందైశ్చ సంవృతో రథసంస్థితః ।
యువా భూషణసంవీతో దేహవానివ మన్మథః ॥
11
(28-49
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి