11, అక్టోబర్ 2023, బుధవారం

రామాయణమ్ 351

 రామాయణమ్ 351

...

రాజులకు రెండువిధాలుగా శత్రువులు ఉంటారు. ఒకరు తన ఇంటిలోని జ్ఞాతులు రెండు తన దేశాన్ని ఆనుకుని ఉన్న సరిహద్దు రాజ్యమువారు.వీరుఇరువురూ సమయము కోసము ఎదురుచూస్తూ ఉంటారు .ఎప్పుడయితే రాజుకు సంకటపరిస్థితి ప్రాప్తించిందో అదను చూసి పదునైన దెబ్బ వేస్తారు .

.

రావణుడు కూలిపోక తప్పదు అతని వ్యసనము అతనిని కూల్చబోవు చున్నది .ఆ సంగతి బాగుగా గ్రహించినవాడు కావున విభీషణుడు మనతో జట్టు కట్టుటకు వచ్చినాడు .

.

అన్ననే వదలినవాడు మనలను వదలడా అని సుగ్రీవుని సందేహము .అది జరుగుటము ఆస్కారములేదు ఏలనగా

మనతో భవిష్యత్తులో కూడా అతనికి శత్రుత్వము ఏర్పడే అవకాశము లేదు ఏలనన మనము ఆతని సరిహద్దు రాజ్యము వారలము కాము ! అతని జాతి వారమూ కాము.

.

కావున ఇంతకన్న మంచి అవకాశము అతనికిఎప్పుడు లభించును ?ఇతనికి రాజ్యమందు కోరిక ఉన్నది.

.

రాక్షసుడే కదా ఈతడు ! బుద్ధిహీనుడేమో అని శంకించంకండి. 

.

కులమును బట్టి బుద్ధిని నిర్ణయింపలేము .వారిలో కూడా గొప్ప మేధో సంపన్నులు పండితులు కలరు . కావున ఈతడు మిత్రుడుగా గ్రహింపదగినవాడే !

.

జ్ఞాతులెవ్వరూ భయములేక సంతోషముగా కలిసి ఉండజాలరు .

.

నా వంటి పుత్రుడు 

సుగ్రీవుని వంటి మిత్రుడు

భరతుని వంటి సోదరులు ఎక్కడా ఉండరు !

.

 ( శ్రీరాముడు ఇలా ఎందుకన్నారో రేపటి కొరకు చూడవలసినదే)

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: