1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మాఘపూర్ణిమ

 🌹 *మాఘపూర్ణిమ , మహామాఘి*


నేడు మాఘపూర్ణిమ. ఇది విశేష పర్వదినం. 

స్నానానికి ప్రముఖ మైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) 

ఈ రోజు నైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.

తిథుల్లో ఏ పూర్ణిమ అయిని సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిథే. 

ఈ తిథినాడు ఇష్టదేవతారాధన, ధ్యానజపాది అనుష్ఠానాలు మహిమాన్విత మైన ఫలాన్ని ఇస్తాయి. 

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మాఘ, 

కార్తిక, 

వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్ట మైనవి. 

వాటిని వ్యర్థంగా గడుపరా దని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

*వైశాఖీ కార్తికీ మాఘీ*

*తిథయో౭ తీవ పూజితాః!*

*స్నాన దాన విహినాస్తా*

*ననేయాః పాండునందన!*

స్నానదానజపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాల పూర్ణిమలను గడుపరాదు.

మాఘపూర్ణిమ నాడు 

*అలభ్యయోగం* అని కూడా అంటారు. 

అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. 

 అది అంత తేలికగా లభించేది కాదు.


(సేకరణ)

    🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: