.
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లో𝕝𝕝
*ఆదిత్య చంద్రా వనిలోనలశ్చ*
*ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ|*
*అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే*
*ధర్మో హి జానాతి నరస్య వృత్తమ్||*
తాత్పర్యము:
*సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, ఆకాశము, భూమి, నీరు, తన హృదయము* (మనసు), *యముడు, పగలు రాత్రి, ఉభయ సంధ్యలు, మరియు ధర్మము మానవుని ప్రవర్తనకు (చేయు పనులకు) సాక్షీ భూతములు*.....
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లో𝕝𝕝
*జకారో జన్మవిచ్చేదః*
*పకారః పాపనాశకః |*
*తస్మాజ్జప ఇతి ప్రోక్తో*
*జన్మ పాపవినాశకః ||*
తా𝕝𝕝
*“జ”కారము జన్మ కలుగకుండ జేయును....ప” కారము పాపమును నశింప జేయును*.... *జన్మము, పాపము రెంటిని నాశము చేయునది కావున “జప” మందురు*.... *పరమాత్ముని నామము లన్నింటిలో మూగవాడు కూడ పలుకదగిన నామము "ఓమ్" అనునది శ్రేష్ఠమైనది*.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి