🙏💐🌹🙌Establishment of Supreme Court bench in AP for South India is our main aim🙌🌹💐👍
🌹భగవద్గీత🌹
మూడవ అధ్యాయము కర్మయోగము నుంచి 27 శ్లోకము. పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా.
ప్రకృతేః క్రియమాణాని
గుణైః కర్మాణి సర్వశః ౹
అహంకారవిమూఢాత్మా
కర్తాఽహమితి మన్యతే ౹౹(27)
ప్రకృతేః , క్రియమాణాని ,
గుణైః , కర్మాణి , సర్వశః ౹
అహంకారవిమూఢాత్మా ,
కర్తా , అహమ్ , ఇతి , మన్యతే ౹౹(27)
కర్మాణి = కర్మలన్నియును ;
సర్వశః = అన్నివిధముల ;
ప్రకృతేః గుణైః = ప్రకృతిగుణముల ద్వారా ;
క్రియామాణాని = చేయబడు చుండును ;
అహంకారవిమూఢాత్మా = అంతఃకరణము నందు అహంకార మోహితుడైన అజ్ఞాని ;
అహం , కర్త , ఇతి = "నేనే కర్తను" అని ;
మన్యతే = తలంచును
తాత్పర్యము :- వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతిగుణముల ద్వారానే చేయబడు చుండును. అహంకార విముఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని) " ఈ కర్మలకు నేనే కర్తను " అని భావించును. (27)
ఆత్మీయులందరికి శుభ శుభోదయం
Yours Welwisher
Yennapusa Bhagya Lakshmi Reddy
Advocate AP High Court Amaravathi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి