9, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీరామభుజంగస్తోత్రం


1) మైథిలీహృదయవాసధర్మనిష్ఠాపరం
   కోదండదండధార్యశతృభంజనాకృతిం
   వాంచితార్ధఫలప్రదనీలమేఘసుందరం
   సాకేతపురనివాస శ్రీరామచంద్రం ||

2) కౌసల్యప్రియపుత్రశ్రీదశరథాత్మజం 
   ఖరదూషణాదిహంతప్రచండవిక్రమం
   వేదవేదాంగవేద్యఘనపురుషోత్తమం
   సాకేతపురనివాస శ్రీరామచంద్రం ||



3) జాంబవంతసుగ్రీవహనూమంతసేవితం
   గౌతమాదిమౌనిసేవ్యమృదుపాదపంకజం
   దుఃఖదారిద్ర్యశమనభుక్తిముక్తిదాయకం
   సాకేతపురనివాస శ్రీరామచంద్రం ||

4) తీవ్రపీడరోగదమనసంసారభేషజం
   కాలకాలసేవ్యమానశ్రీపరంజ్యోతిం
   దండకారణ్యచరపితృవాక్యపాలకం
   సాకేతపురనివాస శ్రీరామచంద్రం ||




5) దుష్టవాలిసంహారసప్తతాళభంజనం
   దశగ్రీవదర్పదహనలంకావినాశకం
   కౌశికాసువనరక్షధనుర్వేదపారగం
   సాకేతపురనివాస శ్రీరామచంద్రం ||

     సర్వం శ్రీరా

మచంద్రదివ్యచరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు: