9, సెప్టెంబర్ 2020, బుధవారం

**సౌందర్య లహరి**

*దశిక రాము**



శ్లోకము - 4

**శ్రీ శంకర భగవత్పాద విరచితము**

శ్రీలలితాంబికాయైనమః

త్వదన్యః పాణిభ్యామ

అభయవరదో దైవతగణః

**త్వమేకా నైవాసి**
**ప్రకటితవరాభీత్యభినయా**

**భయాత్ త్రాతుం దాతుం**

**ఫలమపి చ వాఞ్ఛాసమధికం**

**శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ** ॥ 4 ॥

సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ! నీకన్నా ఇతరులైన దేవతలు తమ తమ చేతులతో అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరద, అభయ ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, కోరినదానికన్నను ఎక్కువగా ఫలములనిచ్చుటకు నీ పాదములే సమర్థములైనవి.

'వాంఛాసమధికం' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము.
🙏🙏🙏

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: