9, సెప్టెంబర్ 2020, బుధవారం

భగవంతునికి పూజ


‘భగవంతునికి పూజ’ అనేది హిందు ధర్మములో సగుణ ఉపాసనా పద్ధతికి పునాదివంటిది.

 ‘వర్తమానములోని భారవంతమైన జీవనములో భగవంతుని పూజ చేయుటకు ఎవ్వరి దగ్గర సమయము ఉంది ?’, అనేటటువంటి నకారాత్మక మానసికత ప్రస్తుతము అనేక జనాల్లో కనిపిస్తున్నది.
 రోజు చేసే నిత్యకర్మలలో ఒక్క నిత్యకర్మను పూర్తి చేయాలని దేవుని మీద నీటిని తొందర-తొందరగా జల్లి చందనం బొట్టు పెట్టుట, ఏవో పువ్వులను సమర్పించి ఊదుబత్తిని తిప్పడము మరియు చివరిలో ‘దేవుని పూజ’, అయిపోయిందని అనుకోవడము జరుగుతుంది. ఇలాంటి విచిత్రము నేడు కనిపిస్తుంది.
సంపూర్ణ సృష్టిని పోషించే భగవంతుని తొందర-తొందరగా పూజించి ఈ విధంగా ‘పూర్తి చేయడము’, వాస్తవంగా భగవంతుని పూజ అనవచ్చా ?
 ఇలా చేసిన తరువాత భగవంతుడు కూడ మన మీద కృపను ఎందుకు చూపుతాడు ?
 ఏ విధంగా మనము ఇంటికి వచ్చిన అతిథిని గౌరవపూర్వకంగా స్వాగతిస్తామో, అదే విధంగా భగవంతుని స్వాగతిస్తే అనగా భగవంతునికి శాస్త్రాన్ని అనుసరించి పూజిస్తేనే, వారు మన మీద ప్రసన్నమై మనకు అనేకమైన ఆశీర్వాదములను ప్రసాదిస్తారు.

  దేవుడి పూజ అనగా ఏమి?
 దేవుని పూజ నిర్మితము, మహాత్వము, ప్రకారములు, కొన్ని దేవతల పూజ యొక్క విశిష్టత మరియు దానికి గల కారణాలు, దేవుడి పూజ రోజులో ఎన్ని సార్లు చేయాలి మరియు ఏ సమయము చేయాలి, దేవుడి పూజ ఎప్పుడు చేయకూడదు అనువాటి గురించి శాస్త్రమును తెలుసుకుందాం.

1. దైవ పూజ :

భగవంతునికి శ్రద్ధతో మనస్సు ద్వారా సమర్పించే విధియుక్త ఉపచారము అనగా ‘దైవ పూజ’. ‘దేవుని ఛాయాచిత్రము లేదా విగ్రహమునకు శాస్త్రీయ పద్ధతితో చేసిన పూజ భగవంతునికి అపేక్షిత రూపంగా ఉన్నచో, అది వాస్తవిక రూపములో ‘పూజ’ అవుతుంది.’ –

2. ఉత్పత్తి

 పూజావిధితో సంబంధిత కృత్యముల ఉత్పత్తి బ్రహ్మాండములో ఉన్న ఇచ్ఛాశక్తి సహాయముతో అగుట

‘పూజ చేయుట, నైవేద్యమును నివేదించుట మొదలగు కర్మకాండముతో సంబంధిత కృత్యములు బ్రహ్మాండములోని ఇచ్ఛాశక్తితో సంబంధించినవి. ఈ కృత్యములను చేయుచున్నప్పుడు జీవుని భావమునకనుగుణంగా  ఆయా కృత్యముల ద్వారా ఆయా దేవతల ఇచ్ఛశక్తికి సంబంధించిన తరంగాలు లభిస్తాయి.

3. ప్రాముఖ్యత

. విగ్రహం పై చేయబడే పూజ సంస్కారం వల్ల దైవత్వం జాగృతమగుట

ప.పూ. పాగనీస్ మహారాజ్ గారు ప్రతీరోజు ఒక దేవతా విగ్రహమును పూజించేవారు. విగ్రహము మీద నిరంతరము అవుతున్న ఈ సంస్కారముల వలన అందులో గల దేవతా తత్త్వము జాగృతము అయినది మరియు అందులో 5 శాతము వరకు పెరిగినది. పూజాది సంస్కారముల వలన విగ్రహములోని దేవతాతత్త్వము జాగృతము అవుతుంది. దానితో పాటుగా, సంస్కారములలో భావము ఉన్నచో, అనగా పూజా కృత్యములలో భావము ఉన్నచో, ఆ విగ్రహములో దేవతాతత్త్వము పెరుగతుంది.

భగవంతుని కృప అగుట

పూజ చేయుట వలన దేవతలు ప్రసన్నులౌతారు. అనగా దేవతా కృపను పొందుటకు పూజకునికి సులభము అవుతుంది.

 పూజకునిలో చైతన్యము పెరుగుట

భగవంతునికి పూజ చేయుట వలన పూజకునికి దేవతా తత్త్వము లభిస్తుంది. అతనిలో గల రజ-తమ ప్రమాణము తగ్గి చైతన్యములో వృద్ధి అగును.

 ‘భగవంతునికి పూజ చేయుట వలన లభించిన సాత్త్విక తరంగాల ద్వారా రోజు వారి కార్యము ప్రారంభము అవుతుంది.’

వాతావరణ శుద్ధి

భగవంతుని పూజ, వాతావరణములోని సాత్త్వికత పెరుగుటలో సహాయము చేస్తుంది.
భగవంతునికి పూజ’ అనేది హిందు ధర్మములో సగుణ ఉపాసనా పద్ధతికి పునాదివంటిది.
హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది.
ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం,
రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం.
దైవమే కాంతి.
ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు.
కాంతివి నీవే.
నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి,
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము.
వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి.
వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి.
విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన
అందరిలో కలుగుతుంది.
ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ
జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం.
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని
భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది.
భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు.
అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది.
ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు.
ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు.
కాని భగవంతునికి వీటితో పనిలేదు.
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు.
కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది.
పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు
అని అర్థం కాదు.
సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం
అని అర్థం.
ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.
దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు
దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది.
దానిలో ఉండే నీరు సంస్కారము.
కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి.
అదే నిజమైన నివేదన.
లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం,
హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది.
హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు.
మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.
మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి.
ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు.
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి.
ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది..
అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

4. దైవపూజ యొక్క ప్రకారములు

ధర్మశాస్త్రములో భగవంతుని పూజకు కొన్ని ప్రకారములు చెప్పబడినవి. మొదటి రెండు ప్రకారములు, సామాన్యంగా దేనినైతే మనము ‘పూజ’ అంటామో, అది స్థూల స్థాయికి చెందినది మరియు దాని తరువాయి రెండు ప్రకారములు సూక్ష్మ స్థాయికి చెందినవి.

 పంచోపచార పూజ (మూర్తి లేదా చిత్రమునకు పూజ)

ఇందులో చందనము, పుష్పము, ధూపము, దీపము మరియు నైవేద్యము, ఈ అయిదు ఉపచారములను భగవంతునికి సమర్పిస్తారు.

. షోడశోపచార పూజ (మూర్తి లేదా చిత్రమునకు పూజ)

ఇందులో పైన చెప్పిన పంచోపచారములతో పాటుగా పదహారు ఉపచారములు సమావేశమైనవి.

మానస పూజ

మనస్సుతో సగుణ మూర్తి కల్పనను చేసి, దానిని పూజ చేయుట

. పరాపూజ

పరావాణితో నిర్గుణ పరబ్రహ్మను పూజించుట

 కొన్ని దేవతల పూజా విశేషతలు మరియు వాటి కారణములు

 దేవతలను ప్రసన్నలుగా చేసుకోవడం

పంచోపచారము మరియు షోఢశోపచారము పూజ వలన దేవత ప్రసన్నము అవుతారు. హిందూ ధర్మము విశేషత ఏమనగా, కొన్ని దేవతలకు ఫలానా ఉపాసనా పద్ధతులు ప్రియమై ఉంటాయి. వీటిని ఆచరించుట వలన ఆ దేవతలు ప్రసన్నులౌతారు. హిందూ ధర్మములోని ఈ విశేషతను తెలిపేందుకు ముందర కొన్ని దేవతల పూజా విశేషతలను కారణా సహితంగా ఇవ్వబడినవి. అధ్యాత్మలోని ఇంత లోతైన చింతన కేవలము హిందూ ధర్మములోనే కనిపిస్తుంది.

దీపప్రియః కార్తవీర్యో మార్తండో నతివల్లభః

స్తుతిప్రియో మహావిష్ణూర్గణేశస్తర్పణప్రియః ॥

దుర్గార్చనప్రియా నూనమభిషేకప్రియః శివః

తస్మాత్తేషాం ప్రతోషాయ విదధ్యాత్తత్తదాదరాత్ ॥

దీపప్రియః ………విదధ్యాత్తత్తదాదరాత్ ॥

సందర్భము : మంత్రమహోదధి 17.116-117 మరియు నారదపురాణము, పూర్వ. 76.115-116

అర్థము : కార్తవీర్యునికి దీపము, సూర్యునికి నమస్కారము, శ్రీవిష్ణూవునకు స్తుతి, శ్రీ గణేశునికి తర్పణము, శ్రీ దుర్గాదేవికి అర్చన మరియు శివునికి అభిషేకము ప్రియమైనవి. అందుకని ఈ దేవతలను ప్రసన్నముగా చేయుటకు వారికి ప్రియమైన కార్యమునే చేయవలెను.

శివపూజలో శంఖము యొక్క ప్రాముఖ్యత లేదు

శివపూజలో శంఖమును పూజించరు, అదే విధంగా శంఖముతో జలము వదిలి శివునికి స్నానమును చేయించరు. దేవుళ్ళ విగ్రహ స్థాపన పంచాయతనానుసారంగా ఉంటే, అప్పుడు అందులోని  బాణలింగము మీద శంఖోదకమును వదులవచ్చు; కానీ మహాదేవుని లింగమైన బాణలింగమునకు శంఖోదకముతో స్నానమును చేయించవద్దు.’

శాస్త్రము : శివలింగములో నీటిపాత్ర రూపములో స్త్రీకారకత్వము ఉండుట వలన మరలా స్త్రీకారకత్వము గల శంఖముతో జలమును వేయవలసిన ఆవశ్యకత లేదు. బాణలింగముతో పాటుగా నీటిపాత్ర ఉండదు కాబట్టి దానికి శంఖము జలముతో స్నానమును చేయిస్తారు.

 హారతి సమయములో శంఖునాదము విహితమైనది

‘దేవాలయములో మహాదేవుడి పూజ చేస్తున్నప్పుడు శంఖపూజ లేదు; కాని హారతికి ముందు శంఖనాదము చేయమని ఆదేశించడము జరుగతుంది మరియు తప్పకుండా జరుగతుంది.’

శాస్త్రము : శంఖానాదముతో ప్రాణాయామము యొక్క సాధనైతే అవుతుంది; దీనితో పాటుగా శంఖానాద ధ్వని ఎక్కడి వరకైతే వినబడుతుందో, ఆ పరిసరములలో భూతము, పిశాచి మొదలగు చెడు శక్తుల కష్టము ఉండదు.

భగవంతుని పూజను రోజులో ఎన్నిసార్లు
మరియు ఏ సమయములో చేయవలెను ?

దేవుని పూజ నిత్య కర్మయైనది. ప్రతీదినము త్రికాలములో (ప్రాతఃకాలములో, మధ్యాహ్నము మరియు సూర్యాస్తమయము తరువాత) షోడశోపచార (పదుహారు ఉపచారములతో) పూజ చేయవలెను. ఒక్కవేళ ఈ పూజను త్రికాలములో చేయడము సాధ్యము కాకపోతే ప్రాతఃకాలములో షోడశోపచార పూజను చేయవలెను మరియు మధ్యాహ్నము, సూర్యాస్తమయము తరువాత పంచోపచార (అయిదు ఉపచారములతో) పూజను చేయవలెను. త్రికాల పూజను చేయడము సాధ్యము కాకపోతే త్రికాల సమయములో కనీసము ఒక్కసారైనా పూజను చేయవలెను. షోడశోపచార మరియు పంచోపచార పూజ అసాధ్యము అయితే, చందనము మరియు పుష్పములతో రెండు ఉపచారములతో పూజను చేయవలెను. ధర్మశాస్త్రములో ఈ విధమైనటువంటి వికల్పములు ఇవ్వబడినవి. ఏ స్థితిలోనైనా ఉపాసకుని ద్వారా దేవుని పూజ జరుగవలెనని దీని ఉద్ధేశ్యము !

 ‘దేవునికి త్రికాల పూజను చేయవలెను’, అని శాస్త్రములలో చెప్పబడినది;
అయిననూ కూడ కలియుగములో ‘కేవలము ఉదయము అయినా పూజ
తప్పకుండా చేయండి, అని చెప్పుటకు గల వివిధ కారణములు

ప్రాతర్మధ్యందినో సాయం దేవపూజాం సమాచరేత్

అర్థము : అయినంతవరకు దేవునికి త్రికాల పూజను చేయవలెను.

 కలియుగములో సాత్త్వికత లోపము వలన కర్మకాండము మాదిరిగా ధర్మములోని
సర్వ ఆచారములను పాటించుట అసాధ్యము అగుట వలన రూఢీవాదము స్థాపితము అగుట

‘పూర్వకాలము సాత్త్వికముగా ఉండేది, అందువలనే త్రికాల పూజను చేసి రోజంతటిలోని మూడు జాములలో బ్రహ్మాండములో విడువబడే రజ-తమాత్మక ధారణను నాశనము చేసి వాతావరణమును శుద్ధముగా ఉంచుట సాధ్యము అయ్యేది; కాని ఇప్పుడు కలియుగములో సాత్త్వికత లోపించినది. అందుకనే కర్మకాండము మాదిరిగా ధర్మములోని సర్వ ఆచారములను పాటించుట అసాధ్యము అయినది. అందువలన కనీసము ఉదయము సమయములో భావపూర్వక పూజను చేసి భగవంతుని నుండీ ప్రక్షేపితము అయ్యే చైతన్యమును వాస్తులో పొందుపరచి ఉంచటానికి ఈ రూఢీవాదమును ప్రతిపాదితము చేయడము జరిగినది. అందుకనే కనీసము ప్రాతఃకాలములోనైనా పూజను చేయమని సంత్ మహానీయులు శిక్షణను ఇచ్చారని తెలుస్తుంది.

భక్తియోగములో ప్రత్యక్షముగా కర్మకు ఆధారమైన భావము,
మానసపూజ మరియు నామజపమునకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చుట

  భావము మరియు మానసపూజ

ఉపాసనాకాండములో ప్రత్యక్షముగా ఆయా సమయములో కర్మను చేయుటను అనివార్యముగా భావిస్తారు; కానీ భక్తియోగములో కేవలము ప్రత్యక్ష కర్మకు ఆధారభూతమైన భావమునకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వడము జరిగినది. అందుకనే మానసపూజ వంటి ఉపాసనా పద్ధతి నిర్మాణమైనది.

నామజపము

కలియుగములో మాయాలొని కర్మలకు విశేషమైన ప్రాముఖ్యత లభించినది. అందువలన ‘కర్మ చేస్తున్నప్పుడు నోటితో జపము చేయుట’ను సర్వశ్రేష్ఠ ప్రకార సాధనగా చెప్పబడినది మరియు త్రికాల పూజను చేయుట సాధ్యము కాకపోవుట వలన ఒక్కసారి ఉదయము పూజ చేసిన తరువాత పని చేస్తూ నామజపమును చేయుట సర్వత్రా సమ్మతించబడినది. అందుకనే సాధు-సంతులు కలియుగములో పూజాకాండము చేయుట కన్ననూ, నామసాధన సరళమైనది’ అని చెప్పారు.

దీని ద్వారా తెలిసేది ఏమనగా, ‘కాలము ఎలాగా ఉంటుందో, అలాగా ఉపదేశము’, ఈ ప్రధాన సూత్రమును ఉపయోగించి సాధు-సంతులు ఆయా కాలములలో సమష్టి (సమాజ) కళ్యాణమును సాధించుటకు ఎలా ప్రయత్నిస్తారనేది తెలుస్తుంది.’

భగవంతుని పూజను ఎప్పుడు చేయకూడదు ?

 స్నానము చేయనప్పుడు మరియు వ్యసన (మాదక పదార్థము) స్థితిలో ఉన్నప్పుడు

మడి అయిన పది రోజుల వరకు. (మడి తగిలిన తరువాత పది రోజుల వరకు మైలు ఉంటుంది. పదుకొండవ రోజు శుద్ధి అయిన పిమ్మట పూజను చేయవచ్చును. మడి తగిలిన 12వ రోజు తరువాతనే కర్త పూజ చేయవచ్చును.)

 ఇంటిలోని స్త్రీ రజస్వల అయితే మరియు ఏ గదిలోనైతే ఆమె తిరుగదో, ఆ గదిలో పూజాగదిని స్థాపించవలెను, ఇంటిలోని జ్యేష్ఠ పురుషులు స్నానోపరాంతము పూజను చేయవలెను. ఖాళీ ప్రదేశము లేకపోవుట వలన ఒక్కవేళ పూజాగదిని వేరే గదిలో పెట్టడము సాధ్యము కాకపోతే, నాలుగు రోజులు (స్త్రీ యొక్క రజోకాలము సమాప్తము అయ్యేంతవరకు) పూజాగదిని బట్టతో కప్పివేయవలెను. ఏదో కారణము చేత ఈ విధముగా పూజాగదిని మూసి ఉంచడము అనుచితము కాదు.
వైష్ణవ సంప్రదాయములోని దేవాలయములలో కూడ ‘భగవంతుడు స్నానమును చేస్తున్నాడు, భగువంతుడు నిద్రిస్తున్నాడు’ అనే కారణములతో భగువంతుని విగ్రహమును తెరతో కప్పివేసే పద్ధతి కలదు.
ఇది ఒక రకముగా భగవంతునికి వేరే గది తయారు చేయుటయే అగును.

 దేవుని పూజను ఏ దిశలో చేయవలెను?

తూర్పు దిశకు అధిక ప్రాముఖ్యము ఉన్నది మరియు ఆ దిశ వైపునకు ముఖమును చేసి పూజావిధిని చేయమని చెప్పబడినది; అందుకనే పూజాగది ఎల్లప్పుడూ తూర్పు-పశ్చిమ దిక్కులో ఉండటము సరియైనది.

కనుక ఆన్ లైన్ పూజలో ఆ వాతావరణము, సాత్విక తరంగాలు మరియు వాతావరణ శుద్ది /మన దాకా రావు/జరగదు.
🙏🙏🙏

కామెంట్‌లు లేవు: