9, సెప్టెంబర్ 2020, బుధవారం

*తలపై శిఖ ఎందుకు?*



తలపైఉండే జుట్టుముడినే శిఖ అనీ, *చూడా* అనీ అంటారు. చిన్నపిల్లలకు చేసే ఈ సంస్కారాన్నే *చూడాకరణం* అనీ, చేలమని పిలుస్తారు.

మన శరీరం ఒక విద్యుత్ కేంద్రం. దీనిలోని విద్యుత్ ఉత్పాదనలో ఎక్కువ తక్కువలొచ్చి ఆరోగ్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది.

ఉపనయన సమయంలో, మంత్రోపదేశం చేసేటప్పుడు విద్యుత్ పెరిగిపోకుండా ఆయుష్కర్మ (వపనం=క్షురకర్మ) చేసి, పిలక పెట్టడం వల్ల విద్యుత్తు కొంతతగ్గి, శిరస్సుకు రక్షణ ఏర్పడుతుంది.

శిఖ అరచేతి అంత, గోష్పాదమంత ఉండాలని శాస్త్రం. పంచశిఖల్ని ఉంచుకోవడం వల్ల వివేకం, ధృఢత్వం, దూరాదర్శనం, దయ, నిగ్రహం కలుగుతాయి.

*సదోపవీతి నా భావ్యం, సదాబుద్ధ శిఖేనచ, విశిఖో వ్యుపవీతశ్చయ త్కరోతి నతత్కృతమ్* అంటే శిఖలేనివాడు, జందెం లేనివాడు చేసిన ధర్మకార్యాలు ఫలమునివ్వవు అని బోధాయనవచనం.

శిరస్సుపై బ్రహ్మ రంద్రముంటుంది. ఆ సహస్రారమే ఆత్మకు కేంద్రస్థానం. ఇక్కడే సాత్విక ఆధ్యాత్మిక శక్తులుంటాయి. వీటిని రక్షించుకోవడానికి ఆవుడెక్కంత పిలక ఉంచుకోవాలి. శిఖ తీసేస్తే కామవికారం పెరుగుతుంది.

కాబట్టే మునులు, బ్రహ్మచార్యులు, యోగులు, గర్భిణీ స్త్రీ భర్తలు జడలు, గడ్డాలు పెంచి ఇంద్రియ నిగ్రహం అలవరచుకునేవారు.
                                 స్వస్తి!

కామెంట్‌లు లేవు: