9, సెప్టెంబర్ 2020, బుధవారం

*ధార్మికగీత - 15*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                           
                                       *****
           *శ్లో:- ఏక స్స్వాదు న భుంజీత ౹*
                  *నైకః సుప్తేషు జాగృయాత్ ౹*
                  *ఏకో న గచ్ఛేత్ అధ్వానమ్ ౹*
                  *నైక శ్చార్థాన్ ప్రచింతయేత్ ౹౹*
                                       *****
*భా:- షడ్రసోపేతము, రుచి,శుచి గల మధురాతిమధురపదార్థములను ఒంటరిగా, ఏకాంతంలో మక్కువతో తినకూడదు.ఇరుగు పొరుగువారికి పెట్టి తింటే, ఇంకా రుచి పదింతలు పెరిగి మధురమౌతుంది. పరాయిచోట అందరు నిద్రపోతుండగా, నీవు ఒక్కడివే మేల్కొని ఉండ కూడదు. విలువైన వస్తువు పోతే ఆ నేరం నీ మీద పడవచ్చు. లేదా నీ మీద అనుమానానికి దారి తీయవచ్చు. పుణ్య క్షేత్రాలు, తీర్థాలకు, యాత్రలకు ఒంటరిగా పయనించరాదు. మంచి,చెడు ఏది జరిగినా సమాచారం కూడా తెలియదు. ఇక సంసారసాగరాన్ని యీదేటప్పుడు ఎదురయ్యే విద్య, విదేశీయానము, నెయ్యము, వియ్యము, కయ్యము, వేడుక, వ్యాజ్యము సంబంధిత ఆర్థిక ఇబ్బందుల పరిష్కారం కోసం ఒక్కడివే తలబద్దలయ్యేలా ఆలోచించక, హితులు, సన్నిహితులతో చర్చించాలి. సరియైన, చక్కనైన పరిష్కారమార్గము సులువుగా దొరకవచ్చును. తరాలు, అంతరాలు మారినా, ఆధునికతకు,సాంకేతికతకు పెద్దపీట వేసినా పెద్దల మాటల్లో నిత్య సత్యాలు లేకపోలేదు. వారి మాటల్లో గల శ్రేయోదాయకమైన అంతరంగాన్ని, ఆంతర్యాన్ని ఆస్వాదించాలని సారాంశము.*
                                  *****
                   *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: