13, మార్చి 2021, శనివారం

మన మహర్షులు- 48

 మన మహర్షులు- 48


 సంవర్త మహర్షి



🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



బ్రహ్మ మానస పుత్రుడయిన అంగిరసుడు తన ధర్మపత్ని శ్రద్ధ యందు పొందిన కొడుకు సంవర్తుడు.


సంవర్తుడు జ్ఞాని, యోగి, తపశ్యాలి, నిస్సంగ, నిర్మముడు, నిరుపమ శక్తి సంపన్నుడు. సంవర్తనుడు ప్రపంచ విషయాలకీ విరక్తుడై విరాగియై యోగీశ్వరుడై అడవులలో తిరుగుతూ ఉండేవాడు.


పూర్వం మనువంశ రాజైన మరుదత్తుడు, ధర్మతత్పరతతో దయా దాక్షిణ్యాలతో, శక్తియుక్తుడుగా రాజ్యం పరిపాలిస్తున్నాడు .ఇంద్రుడికి అసూయ ఎక్కువైపోయి ఏంచెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు.


అదే సమయంలో మరుదత్తుడు ఇంద్రుణ్ణి మించి పోవాలని ఒక మహాయజ్ఞం బృహస్పతిని చేయించమని అడిగాడు.


 ఇంద్రుడు పిలిచాడు వెళ్ళాలన్నాడు. బృహస్పతి, ఈలోగా నారదుడు కనిపించి బృహస్పతి తమ్ముడు సంవర్తుడు నీతో యజ్ఞం

చేయిస్తాడని మరుదత్తుడికి చెప్పాడు.


సంవర్తుని కలిసి యజ్ఞం చేయించమని అడిగి బృహస్పతి తనను ఎలా అవమానపరిచాడో చెప్పాడు మరుదత్తుడు. 


అన్న దగ్గర అనుమతి తీసుకుని వస్తేనే నేను చేయిస్తాను, ఎందుకంటే అతడు నాకు గురువులాంటివాడన్నాడు సంవర్తుడు. 


మరుదత్తుడు జరిగిందంతా సంవర్తుడికి చెప్పి ఇంద్రుడే నా యజ్ఞం పూర్తి కాకుండా చూస్తున్నాడని బ్రతిమలాడి చివరికి ఒప్పించాడు.


మరుదత్తుడితో యజ్ఞం మొదలుపెట్టించి చివరిసారిగా ఆలోచించుకో ఇంద్రుడికి బృహస్పతికి శత్రువవుతావేమో అన్నాడు సంవర్తుడు,


 మరుదత్తుడు మునీంద్రా! మీరుండగా నేనెవరికీ భయపడను, సూర్యచంద్రులు ఉన్నంతవరకు నువ్వే నా గురువు అన్నాడు భక్తితో హిమవత్సర్వతానికి ఉత్తర భాగంలో వున్న ముంజవంతమనే పర్వతం మీద శివుడి దయతో యజ్ఞం మొదలుపెట్టడానికి మరుదత్తుడికి ఎన్నో పసిడి మోపులు తెచ్చిచ్చాడు సంవర్తుడు.


ఇక్కడ సంవర్తుడు మరుదత్తుడితో యజ్ఞం చేయిస్తుంటే అక్కడ బృహస్పతి ఇంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నాడు .


ఇంద్రుడు అగ్ని హోత్రుడ్ని పిలిచి ఎలాగేనా సంవర్తుడు చేయిస్తున్న యజ్ఞం ఆపమని

పంపించాడు


అగ్నిహోత్రుడు: మరుదత్తుడి దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకుని రాజా! బృహస్పతి నీతో యజ్ఞం చేయించి ఇంద్రపదవి వచ్చేలా చెయ్యడానికి అంగీకరించి నన్ను స్వయంగా ఇక్కడికి పంపాడు, సంవర్తు వల్ల యజ్ఞం పూర్తవదని చెప్పాడు.


మరదత్తుడు అందుకు అంగీకరించక నాకు సంవర్తుడు ఎలా చేయించినా ఫర్వాలేదన్నాడు.


సంవర్తుడు నీ రాయబారం పూర్తియింది కదా ఇంక వెళ్ళమన్నాడు - అగ్నిహోత్రుణ్ణి,


అగ్నిహోత్రుడు జరిగినది ఇంద్రుడికి చెప్పి ఇంక నావల్ల కాదన్నాడు ఇంద్రుడు.


 గంధర్వపతయిన ధృతరాష్ట్రుణ్ఞి పిలిచి మరదత్తుణ్ణి ఎలాగయినా బహస్నతితో యజ్ఞం చేయించుకుందుకు ఒప్పించమని చెప్పాడు.


 వినకపోతే ఇంద్రుడి వజ్రాయుధం నిన్ను యముడి దగ్గరికి పంపుతుందని చెప్పమన్నాడు.


మరుదత్తుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్నట్లు చెప్పాడు ధృతరాష్ట్రుడు గంధర్వరాజా! మొదట నేను బృహస్పతిని అడిగాను, అతడు అంగీకరించి

సమయానికి మాట తప్పాడు. ఇప్పుడు సంవర్తుడు అంగీకరించి యజ్ఞం మొదలు పెట్టాక వద్దు వెళ్ళిపొమ్మనడం న్యాయమేనా మీరే చెప్పండన్నాడు మరుదత్తుడు.


అదే సమయంలో వజ్రాయుధం వేగంగా వస్తుండడం చూసి భయపడున్న మరుదుత్తద్ని సంవర్తుడు అది నీ దాకా రాడు భయపడకన్నాడు.


నాకు 'సంస్తంభ విద్య వచ్చని దాని వల్ల దేవతలు కూడా నా ముందాగలేరని ఇంద్రుడికి తెలుసు. నాశక్తి ముందు దేవతలకి ఆయుధాలు ఏవయినా సరే పని చేయ్యవని

చెప్పాడు సంవర్తుడు.


అప్పటికే వజ్రాయుధం శక్తి హీనమై గాలిలో తిరిగుతోంది. 


మరుదత్తుడాశ్చర్యంతో సంవర్తుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు.



. నీకేం కావాలో కోరుకోమన్నాడు సంవర్తుడు


మునీంద్రా! ఇంద్రుణ్ణి విరోధం మాని యజ్ఞంలో తన హవ్య భాగం తీసుకోమని

చెప్పమని అడిగాడు మరుదత్తుడు.


 సంవర్తుడు యజ్ఞం పూర్తిచేసి తన మంత్రబలంతో ఇంద్రాదులందర్నీ సేవకుల్లా రప్పించాడు .సంవర్తుడు మరుత్తుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆసనం కూర్చోబెట్టారు.


మరుదత్తుడు ఇంద్రుడికి నమస్కరించి నీరాకవల్ల నా జన్నము, జన్మము కూడా సఫలమయ్యాయి. సంవర్తుడు నీ గురువు బృహస్పతికి తమ్ముడు. నీకు గురు సమానుడు

నాకు అన్నీ ఆతడే కనుక కోపం మాని యజ్ఞం పూర్తి చేయించమన్నాడు. 


ఇంద్రుడు సరేనన్నాడు సంవర్తుడు రెండవ అగ్నిలా ప్రకాశిస్తూ యజ్ఞం పూర్తి చేయించి దేవతలందర్నీ తృప్తి పరిచాడు. తర్వాత మరుదత్తుణ్ణి దీవించి సంవర్తుడు వెళ్ళిపోయాడు.


మరుదత్తుడు. ఆనందంతో ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసి షట్చక్రవర్తులో ఒకడయ్యాడు .


సంవర్తుడు దేవతలనే శాసించగల సర్వశక్తి సంపన్నుడై మహర్షి, మహాయోగి

సర్వేశ్వరుడితో సమానమైనవాడయ్యాడు.


 ఇతను రాసిన 'సంవర్త సృఫతి'లో, కన్యావివాహనర్ణన, గోదానమహాత్మ్వం

ఆచారవ్యవవహారం, దినచర్య, ఉపవాసప్రతం, బ్రాహ్మణ భోజనం, గాయత్రీ జపం ప్రాణాయామం లాంటి విషయాలెన్నింటి గురించో వివరంగా తెలియచేశాడు.


 అంతేకాదు అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదనీ, ఇక ముందు కూడా దాన్ని మించిన దానం లేదని

చెప్పాడు సంవర్త మహర్షి .


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

కామెంట్‌లు లేవు: