🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 83*
*****
*శ్లో:- అనభ్యాసే విషం విద్యా ౹*
*త్వ జీర్ణే భోజనం విషం ౹*
*విషం సభా దరిద్రస్య ౹*
*వృద్ధస్య తరుణీ విషమ్ ౹౹*
*****
*భా:- లోకంలో మానవాళికి సందర్భానుగుణంగా విషతుల్యమైన విషయాలు నాలుగు తారసపడతాయి. 1."విద్య":- "అభ్యాసము కూసు విద్య" అన్నారు పెద్దలు. విద్యాభ్యాసంలో శ్రవణ, భాషణ, పఠన, లేఖనములు, వాని వినియోగము కీలక సోపానాలు. వీనిని*
*శ్రధ్ధాసక్తులు, దీక్షాదక్షతలతో క్రమపద్ధతిలో నేర్వని వానికి ఆ చదువు* *కాలకూటవిషమే.జీవితంలో ఒంటబట్టదు. 2."విందు":- పంచభక్ష్య సహితంగా, రుచికరము,శుచికరమై, షడ్రసోపేతమై డెందమలరే పసందైన విందు భోజనాన్ని పీకల దాకా మెక్కి, అరగక* *బాధపడేవాడికి ఒక్క బందరులడ్డు ప్రసాదంగా పెట్టినా అది విషతుల్యమే.ఒక వేళ తిన్నా వెలుపలకు రావలసిందే. 3."సభ":- "ఆకొన్న కూడె అమృతము*"- *అన్నాడు* *సుమతీశతకకర్త.అసలే దరిద్రుడు. పైగా ఆకలెక్కువ. కడుపు కాలుతూ, కూటికోసం అలమటించే వాడికి సభపెట్టి, గొప్పగా ఇచ్చే ఉపన్యాసం కూడా విషతుల్యమే. అందుకే నరేంద్రుడు ముందు* *అన్నం పెట్టి, పిమ్మట హితం చెప్పమన్నాడు. 4."తరుణి":- భార్యా వియోగంతో వేగలేక, పిల్లల్ని, ఇంటిని సాకలేక, ముసలితనంలో చేసుకొన్న దిక్కు, ఆర్థికప్రతిపత్తి, ఆశ్రయము*, *అండాదండాలేని పడుచుపెళ్ళాం కూడా విరసానికి సరసం తోడైనట్లు విషంగా పరిణమిస్తుంది. జీవితాంతం కలచివేస్తుంది. వీనిని లోకవ్యవహారాలుగా,లోకాచారాలుగా నెమరువేసుకోవాలని సారాంశము*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి