9, సెప్టెంబర్ 2023, శనివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 17*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 17*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

       

         *సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభి:*

         *వశిన్యద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః|*

         *స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి:*

         *వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః ||*


ఈ శ్లోకంలో అమ్మవారిని గాయత్రిగా వర్ణిస్తున్నారు. ఈ రూపములో ధ్యానించినవారికి అమ్మవారు


మహతాం భంగిరుచిభి: = మహర్షులు చేసిన విధముగా


స కర్తా కావ్యానాం భవతి = మహా కావ్యములు రచించగలిగిన శక్తిని ఇస్తుంది. ఇంకా,


వాగ్దేవీ వదన కమలామోద మధురైః = సరస్వతీ దేవి యొక్క తాంబూల పరిమళముల వంటి వాక్కులను ప్రసాదిస్తుంది. ఆ తాంబూల పరిమళం దశదిశలా వ్యాపించినట్లు వీరి కవిత్వం యొక్క మాధుర్యం,కీర్తి ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి.


ఇంతకీ ఆ తల్లి ఎలా వున్నది?


వశిన్యద్యాభిస్త్వాం సహ = వశిని మొదలైన వాగ్దేవతలు పరివేష్టించియుండగా


శశిమణి శిలాభంగ రుచిభి: = ఆ వాగ్దేవతలు చంద్రకాంత శిలలు పగిలితే ఎంత తెల్లగా ప్రకాశిస్తాయో, అంత తెల్లగా మెరసిపోతున్నారట.


సవిత్రీభిర్వాచాం = వారు వాక్కులకు కన్న తల్లులు.

గాయత్రీ మంత్రము 24 అక్షరాల సంపుటి. ఇక్కడ అమ్మవారు, వాక్కుకు, విద్యకు సంబంధించిన 8 మంది వశిన్యాది వాగ్దేవతలతోనూ, 12 మంది యోగినులతోను, తెల్లగా మెరిసిపోతున్న ఆకర్షణ శక్తి కల నలుగురు దేవతలతోనూ పరివేష్టించి ఉన్నారట.


వాగ్దేవతలు :-వశిని, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, అరుణ, సర్వేశ్వరి, కౌళిని.(8) ఈ వశిన్యాది వాగ్దేవతలే అమ్మవారి ఆజ్ఞ ప్రకారం లలితా సహస్ర నామములు చెప్పారు.


యోగినులు :- విద్య, రేచిక, మోచిక, అమృత, దీపిక, జ్ఞాన, ఆప్యాయిని, వ్యాపిని, మేథ, వ్యోమరూప, సిద్ధరూప, లక్ష్మి (12 )


ఆకర్షక_శక్తులు :- గంధ, రస, రూప, స్పర్శ,భూమి, నీరు, తేజస్సు, వాయువుల తన్మాత్రలు. (4 )


అమ్మవారు *మాతృకా వర్ణ రూపిణి* అని కొలువబడ్డ అక్షర రూపిణి.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: