9, సెప్టెంబర్ 2023, శనివారం

ధైర్యం మాత్రం ఉండి తీరాలి.

*1895*

*కం*

మనుషుల ధైర్యము బ్రతుకగు

మనుషుల భయమెప్పుడైన మరణ సదృశమౌ.

ధనములు వితతంబైనను

(ధనముల గనియున్నను మరి)

మనసున ధైర్యం పు లేమి మరణమె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనుషుల యొక్క ధైర్యమే జీవితం, భయమెప్పుడైనా మరణం తో సమానం. ఎన్నో రకాలు గా ధనములు ఉన్నప్పటికీ మనసు లో ధైర్యం లేకపోతే అది మరణమే అవుతుంది.

*సందేశం*:-- మనిషి బతకడానికి డబ్బు ఉన్నాలేకున్నా ధైర్యం మాత్రం ఉండి తీరాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ* 


కామెంట్‌లు లేవు: