9, సెప్టెంబర్ 2023, శనివారం

బలవంతుడి దెబ్బ కన్నా


*కం*

తెలివైన వారి ప్రహరము

బలవంతుని వేటు కన్న బలముగ తగులున్.

తెలివగువారల వొడుపులు

బలవంతులకెరుకగావు బలముగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తెలివైన వారు కొట్టే దెబ్బ బలవంతుడి దెబ్బ కన్నా బలంగా తగులుతుంది. తెలివైన వారి ఒడుపులు అంత బలంగా బలవంతులకు అర్థం కావు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

తక్కువ మాట్లాడునపుడు

నెక్కువ విలువొందగలరు నెక్కడనైనన్.

మక్కువ గొని మాట్లాడగ

నెక్కువ గలవిలువలెవరు నెరుగరు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడటం వలన ఎక్కడ నైనా ఎక్కువగా విలువలు పొందగలరు. (మనవాళ్ళు కదా అనే) అభిమానం తో ఎక్కువగా మాట్లాడిననూ ఆ విలువలు ఎవ్వరూ తెలుసుకొనరు.

*సందేశం*:-- మన విలువ పెంచుకోవాలంటే మనవాళ్ళ దగ్గర అయినా తక్కువ గానే మాట్లాడాలి. ఒక గొప్ప వాడు ఎక్కువగా మాట్లాడితే అభిమానం అని గుర్తించక లోకువగా చూస్తారు. తక్కువ గా మాట్లాడితే విలువ లేని వారి కి కూడా అతిగా విలువలు ఇస్తారు. ఇదే జనుల సాధారణ నైజం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: