4, ఆగస్టు 2024, ఆదివారం

శరీరంలో వాతపిత్తకఫాలను

 శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు     


          మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన  యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆయా ఆహారాలు మనశరీరతత్వానికి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకొని తీసుకున్నచో మనకి అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోగం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కన్నా ఆ రోగం రావడానికి గల కారణాలు గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడం 

చాలా మంచిది .


           ఇప్పుడు నేను మీకు వివరించబోయే ఆహార విషయాలు ఆయా శరీరతత్వాల వారు పాటించి పడని ఆహారపదార్థాలుకు దూరంగా అయినా ఉండటం లేదా అతితక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వలన ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.


 * శరీరంలో వాతాన్ని కలిగించు ఆహారాలు -


      అతిగా వ్యాయామం చేయడం , అతిగా ఉపవాసాలు , ఎత్తు నుంచి దూకుట , కాళ్లు చేతులు విరుగుట, ధాతుక్షయం, రాత్రిజాగారం, మలమూత్రాలు బంధించుట లేదా బలవంతంగా విసర్జించుట, అతిగా వాంతులు మరియు విరేచనాల వలన, కషాయాలు మరియు చేదు వస్తువులను అతిగా వాడుట, అతిగా భాధపడుట, భయం , అతిగా ఏడవటం వంటివాటివలన సంధ్యాసమయాలలో, వర్షాకాలంలోనూ, భోజన ముందు సమయాలలోను వాతం వృద్ధిచెందును.


 * శరీరంలో పిత్తాన్ని కలిగించు పదార్థాలు -


        అతి పులుపు , అతికారం , ఉప్పు వంటి తీక్షణ పదార్థాలు తీసుకోవడం , అతిగా కోపగించుకొనుట, ఎండలో ఎక్కువ తిరుగుట, నువ్వులు , పెరుగు , తరవాణి వంటివాటిని అతిగా సేవించుట వలన , మద్యసేవన  వలన , అన్నం జీర్ణం అయ్యే సమయంలోను ,శరత్,గ్రీష్మ ఋతువుల్లోనూ , మధ్యాన్న , మధ్యరాత్రి సమయాల్లోనూ శరీరంలో పిత్తం వృద్ది చెందును .


 * శరీరంలో కఫం వృద్ధి కలిగించు పదార్దాలు -


          చిక్కని మధుర పదార్దాలు అతిగా సేవించుట , పెరుగు , బెల్లం, వెన్న, నెయ్యితో చేయబడిన మధురపదార్ధాల వలన , పగటినిద్ర వలన, హేమంత, వసంత ఋతువులలోను , భోజనం అయినవెంటనే పగలు , రాత్రుల ప్రారంభ సమయాలలో కఫవృద్ధి జరుగును.


     ఇప్పుడు శరీరంలో వాత,పిత్త,కఫాన్ని తగ్గించు ఆహారవిహారాల గురించి తెలియచేస్తాను .


 * శరీరంలో వాతాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


        తియ్యని,పుల్లని , లవణ రసాలు కలిగిన మృదువు కలిగి ఉండి కొంచం ఉష్ణం కలిగించు ఆహారపదార్థాలు .


 *  శరీరంలో పిత్తాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


         కషాయ , చేదు రుచులు కలిగిన చల్లని మధురమైన మృదువు, సాంద్రత కలిగిన ఆహారవిహారాలు .


 * శరీరంలో కఫాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


          వగరు,కారం,చేదు కలిగిన ఆహార పానీయాలు , తీక్షణత, వేడి కలిగిన ఆహారవిహారాలు కఫాన్ని నాశనం చేస్తాయి.


         కావున పైన చెప్పినవిధంగా ఆయా దోషాలు కలిగినవారు  వాటికి తగ్గ ఆహారపదార్థాలు సేవించడం , విడిచిపెట్టడం ద్వారా మీయొక్క ఆరోగ్యాలు కాపాడుకొనవలెను .


  

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: