*మహాభారతానికి…*
*’జయము’ అని పేరు!*
➖➖➖✍️
*భారతానికి 'జయ'మని పేరు రావడంలో అంతరార్థం:-*
*మానవ జీవితంలో ధర్మానికే అంతిమ విజయం అని నిర్దుష్టంగా నిరూపించడం చేత మహాభారతం 'జయ'మని పిలువబడింది.*
*అంతేకాదు. 'జయత్యనేన సంసారమితి' భారతం చదివి, విషయాలను తెలుసుకొని సంసారాన్ని జయించవచ్చు.*
*సంఖ్యాశాస్త్రం రీత్యా కూడ 'జ', 'య' అనే రెండక్షరాలకు ఎంతో ప్రాధాన్యం వుంది. ‘జ’ అనేది ఎనిమిదిని(8), 'మ' (1) ఒకటిని సూచిస్తాయి.*
*'అంకా నాం వామ తో గతిః'- ఎడమవేపుకు అంకెలు లెక్కించాలి - అనే సూత్రం ప్రకారం, ఇవి (8,1) 18 అవుతాయి. అందుకే 18 పర్వాలున్న మహాభారత గ్రంథం 'జయం' అని, 'జయసంహిత', అని ప్రసిద్ధిలోకి వచ్చింది.*
*మనోజయానికి, ధర్మజయానికీ మహాభారతం ప్రతీక అయింది. ఒక త్రాసులో మహాభారతాన్ని ఒక ప్రక్క వేదాలను మరొక వేపు వుంచితే, 'మహత్త్వాత్ భారవ త్వాచ్చ' - భారతమే ఎక్కువ తూగిందట!*
*అందుకే మన సనాతన ధర్మ సాహిత్యంలో భారతానికి 'జయ'మని పేరు వచ్చింది.*
*'జయో నా మేతి హాసో యం'- జయమని పేరుగల గ్రంథాలు మనకు ఇంకా వున్నా, ఒక్క మహాభారత ఇతిహాసానికే 'జయం' అని పేరు రావడంలో గల అంతరార్థం యిది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి