4, ఆగస్టు 2024, ఆదివారం

జీవితమంతా

 *2042*

*కం*

జీవిత మంతయు శ్రమపడి

జీవన సౌఖ్యములు వీడి సిరులార్జించన్(సిరులను కూర్చన్)

దైవానుగ్రహముండక

నీవారసులైన సుఖము నెరుగరు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితమంతా కష్టపడి జీవితం లోని సౌఖ్యములు విడిచిపెట్టి ధనము లు సంపాదించిననూ దైవానుగ్రహం లేకపోతే నీవారసులైనా కూడా వాటి సుఖములు పొందలేరు.

*సందేశం*:-- ధనార్జన తో బాటుగా ఆ ధనముల వలన సుఖసంతోషాలను అనుభవించవలెనంటే దైవానుగ్రహం కావాలి. అది గోసంరక్షకపోషణాదిసేవలు,దానములు వంటి ధార్మిక సత్కర్మలు చేయడం వలన నే సాధ్యమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: