*భక్తి బయటకి కనిపించకూడదు.*
జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారు అచంచలమైన భక్తి కల ఒక భక్తుని ఇంటికి అతని ప్రార్ధన మీద వేంచేశారు. స్వామివారి రాక సందర్భంగా ఆ భక్తుడు అతని ఇంట్లో పూజా గదిని అద్భుతంగా అలంకరించారు. ఆ భక్తుడు గురువుగారిని ఆ పూజ గదికి తీసుకెళ్లాడు.ఆ పూజా గదిని చూచి గురువుగారు ఇలా అన్నారు.
H.H: మీ పూజ గది బహు చక్కగా నిర్వహించడమేకాదు, చక్కగా అందంగా అలంకరించబడి ఉంది.
అతను: అవును స్వామి, మీ పవిత్రమైన పాదాలు మా ఇంటిని, ఈ పూజాగదిని పవిత్రం చేస్తాయని నిన్ననే మా కుటుంబం మొత్తం ఈ పూజాగదిపై శ్రద్ధగా పని చేశాము.
H.H : (ఆశ్చర్యకరమైన స్వరంతో) ఓహ్,అలాగా. ఈ పూజాగది, మీ నివాసం ప్రతిరోజూ ఇలా కనిపించదా..? లేదా?
అతను : లేదు, ఎంతో పవిత్రమైన మీ పాదాస్పర్శ, మీ సందర్శనకు గుర్తుగా ఈ పూజాగది, ఇల్లు శుభ్రం చేయబడి, ఇలా అలంకరించబడింది.
H.H : (నవ్వుతూ) కాబట్టి, మీ దృష్టిలో గురువుల యొక్క భౌతిక ఉనికి మాత్రమే మీకు నిజమైన ఉనికిని సూచిస్తుంది అన్నమాట, అంతేకానీ గురువుగారి ఛాయాచిత్రాలు కేవలం కాగితం ముక్కలుగా పరిగణించబడతాయి. ఔనా?
అతను : (వణుకుతూ) నేను క్షమాపణలు కోరుతున్నాను, గురూజీ, నా అజ్ఞానానికి...
H.H: చింతించకండి. నా పట్ల మీకున్న భక్తి గురించి నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇప్పుడు న రాక సందర్భంగా కనిపిస్తున్న భక్తిని మీ రోజువారీ చర్యగా మీరు అలవాటుచేసుకున్నట్లయితే, మీరు గురువుల అనుగ్రహాలు పొందుతారు. *‘నా గురువు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు’* అనే భావన (వైఖరి) ఒకరిని ఉద్ధరించేది అనే విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని భగవంతుడు శ్రీ శారదాంబా సదా అనుగ్రహించుగాక అంటూ... భక్తుడిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ, ఎంతో అర్ధం స్ఫూరించేలా జగద్గురువులు ఆ ఇంటి నుంచి పయనమయ్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి