4, ఆగస్టు 2024, ఆదివారం

ఐదుగురు తల్లులు

 *🦜𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝🦜*


*శ్లోకము౹౹ :1)*


      *రాజపత్నీ గురోః పత్నీ*

      *భ్రాతృపత్నీ తథైవ చ।*

      *పత్నీమాతా స్వమాతా చ* 

      *పంచైతా మాతరః స్మృతాః॥*


*భావము:*


ఈ లోకంలో మనుజులకు కన్న తల్లి తో సహా ఐదుగురు తల్లులు ఉంటారు. వారెవరంటే, 


1) రాజ్యాన్ని పాలించే రాజు గారి ధర్మపత్ని, 

2) గురువు గారి ధర్మపత్ని, 

3) అన్న భార్య అంటే వదిన గారు,

4) భార్య తల్లి అంటే అత్తగారు 

5) జన్మను ఇచ్చిన సొంత తల్లి


కావున ప్రతి మనిషి  కన్న తల్లితో పాటు పైన చెప్పబడిన మిగిలిన నలుగురి పట్ల కూడా  సమానమైన మాత్రుతుల్య పూజ్య భావాన్ని కలిగి ఉండాలి.


*శ్లోకము౹౹ :2)*


      *జనితా చోపనేతా చ*

      *యస్తు విద్యాం ప్రయచ్ఛతి*।

      *అన్నదాతా భయత్రాతా* 

      *పంచైతే పితరః స్మృతాః ॥*


*భావము:*

అటులనే 

1) కన్న తండ్రి

2) ఉపనయనం చేసిన వారు

3) విద్య గరపిన వారు ఆంటే గురువు

4) అన్నం పెట్టి పోషించిన వారు

5) కష్టాలలోనూ, ఆపదలోనూ ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టి ఆదుకునే వారు.


కన్న తండ్రితో సహా మిగిలిన నలుగురి పట్ల కూడా తండ్రి తో సమానమైన పిత్రుతుల్య పూజ్య భావాన్ని కలిగి ఉండవలెనని ఈ శ్లోకార్థం.


*మరి, ఒకే ఒక లక్షణంతో లేదా ఒకే ఒక బాధ్యత నెరవేర్చి నందులకే కొంతమందికి, తల్లి తండ్రులతో సమానమైన స్థాయి మరియు గౌరవం  ఆపాదించబడినప్పుడు, తనకు జన్మనిచ్చిన కన్న తల్లి తండ్రుల పట్ల ప్రతీ మనిషి ఎంతటి గౌరవ భావం, కృతజ్ఞతా భావం, పూజ్య భావం కలిగి ఉండాలో కదా!*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: