తెలుగు భాషా వికాసం :-
తెలుగు భాషా వికాసానికి యేందరో యెందరెందరో మహానుభావులు పాటు పడినారు. అందరికీ వందనాలు. తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మనమాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా ఉంచుకోవడం మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం!
శంకరం బాడి సుందరాచారి “మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు” పాట వింటే చాలు మనసు పులకరించిపోతుంది.
"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా” అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తి చాటిన వేములపల్లి శ్రీకృష్ణ,
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను - తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి - దేశ భాషలందు తెలుగు లెస్స
—శ్రీ కృష్ణదేవ రాయలు
తియ్యని తేనెల తెలుగు పలుకక - ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా – హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ
—చేరువేల భార్గవ శర్మ
జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె
— వినుకొండ వల్లభరాయడు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు - అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన - కలిసిపోయె తేట తెలుగునందు
— *మిరియాల రామకృష్ణ*
సేకరణ:- కొడవంటి సుబ్రహ్మణ్యం గారు.
1 కామెంట్:
👍
కామెంట్‌ను పోస్ట్ చేయండి