18, మే 2021, మంగళవారం

సింగినాదం జీలకర్ర*

 *సింగినాదం జీలకర్ర*

ఇది తరచుగా వినిపించే ఒక సామెత...


*సింగినాదం అంటే  ఆటవికుల చేతిలో ఉంచుకునే వాద్య పరికరం (దీనిని దుప్పి కొమ్ముతో తయారు చేస్తారు)* 


గతంలో ఓడ రేవులలో *సరుకులతో ఒక ఓడ రేవుకు వచ్చిందంటే దాని రాకను తెలియచేస్తూ శంఖారావం* లాంటి శబ్దం చేసేవారు..... 

దాంతో ప్రజలు, వ్యాపారస్తులు పొలోమని ఓడ వద్దకు వెళ్లి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునే వారు.... 


*ఓడ రాకను తెలియచేసేదే సింగినాదం* .  


*ప్రత్యేకించి ఒక ఓడ మాత్రం అన్ని సార్లూ జీలకర్ర తోనే రేవుకు వచ్చేది*  

సింగినాదం వినపడినా ప్రజలు ఓడ వద్దకు వెళ్లేవారు కాదు....  

ఆఁ .................. ఏముందిలే జీలకర్రె కదా!

అని అనుకుని మిన్నకుండి పోయేవారు....

ఆ విధంగా పుట్టిందే  ఈ మాట......

*సింగినాదం జీలకర్ర* .


మరో కథనం...

సింగినాదం జానపదుల, గిరిజనులు ఎక్కువగా వాడే కొమ్ము వాయిద్యం....

 అప్పట్లో మేక, గొర్రె కొమ్ముతో  కూడా ఈ వాయిద్య పరికరం తయారు చేసి వాడేవారు.....  

ఈ *మేక, గొర్రె దుప్పి కొమ్మును* నీటిలో మరిగించి అందులోని గుజ్జును తీసివేసి వాయిద్య పరికరంగా తయారు చేసేవారు..... *సంస్కృతం లో కొమ్మును శృంగం* అని అంటారు..... 

ఆ శృంగనాదమే వాడుక లో *సింగి నాదం* అయుంది. .... 


పల్లెటూళ్లలో గిరిజనులు అడవి ప్రాంతాలనుంచి వచ్చి పల్లెటూళ్లలో జీలకర్ర అమ్ముతుండేవారు..... 

అలా అమ్మడానికి వచ్చినప్పుడు *శృంగ నాదం* అదే 

*సింగి నాదం* ఊదేవారు..... 



అలా వచ్చిందే ఈ  *సింగి నాదం జీలకర్ర,* అనే సామెత....


*సింగి నాదం జీలకర్ర,*  అంటే చాలా చిన్న విషయం అని కూడా మరొక అర్ధం....

కామెంట్‌లు లేవు: