24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

తెలుగు కవిత

 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష!


మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష!


పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు

దాని పైన మిర్చి దద్దరిల్ల 

జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు   

సాటి తెలుగు  భాష మేటి భాష


స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు

తాగ లెక సురులు ధరణి లొన 

ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు     

ఆవ కాయ కొఱకు నంగలార్చి.


కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ 

కారమింగువలను  తగిలించి తిను వాడు 

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని


ఆట వెలది యనిన అభిమానమెక్కువ

తేట గీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము !! 


తెలుగు భాష.. తెలుగు వంటకములు, తెలుగు తీపి,  ....👏👏👏👍👌😊

కామెంట్‌లు లేవు: