🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకా లు, తీర్థయాత్రలు, దక్షిణలు, ప్రదక్షిణ లు, నామస్మరణలు యిలాంటి పనులన్నింటినీ మనం ఆధ్యాత్మికం అంటున్నాం. అనుకుంటున్నాం. ఇవేవీ కానివి, వీటికి సంబంధంలేని ఇతరత్రా పనులన్నిటినీ లౌకికమని అంటున్నాం. నిజానికి పూజలు, వ్రతాలు వంటివన్నీ ఆధ్యాత్మికానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గాలు. సాధనా సరంజామాలు.*
*కానీ అవే అసలు సిసలైన ‘ఆధ్యాత్మికం’ అని అనలేం. ‘నేను’ అనే స్థాయి నుంచి విస్తృతమై, విశాలమై ‘మనం’ అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం. రాక్షసత్వం నుంచి పశుత్వానికి, పశుత్వం నుంచి మాన వత్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవటమే ఆధ్యాత్మికం. సంకుచిత్వం నుంచి సంయుక్త తత్వానికి, ఆటవికం నుంచి ఆత్మ తత్వానికి చేరుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మికం.*
*ఆధ్యాత్మికం అనేసరికి పూర్వ జన్మ సుకృతం, కర్మ ఫలం, ప్రాప్తం, అప్రాప్తం అనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అన్నీ వాతంతట అవే అమరిపోయి అన్నీ చకచకా జరిగిపోతుంటే, ‘ఆహా! అది వాడి ప్రాప్తం’ అంటాం. అలా జరగక ఎదురు తిరిగితే ప్రాప్తం లేదంటాం. పూర్వజన్మ ఫలం అంటాం. కర్మ అనుభవించాలి అంటాం. అప్రాప్తం అని కూడా అంటాం.*
*తలచింది జరిగిందంటే అంతా మన ప్రతిభ అనంటాం. తలచింది జరగని నాడు తలరాతం టూ విధిపై నెడతాం. అయితే భగవంతుడి అనుగ్రహం అనేది ఈ ప్రాప్తం, అప్రాప్తాలు, పూర్వజన్మలు, కర్మలు, సుకృతాల మీదే ఆధారపడి ఉండదు. మన సాధన మీద, మన ప్రయత్నం మీద, దీక్ష మీద, మనం ఉండే స్థితి మీద, పరిస్థితి మీద, మన సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి