> శ్లో॥
> న రణే విజయాత్ శూరో అధ్యయనాత్ న చ పండితః
> న వక్తా వాక్పటుత్వేన న దాతా చ అర్ధ దానతః
> ఇంద్రియాణాం జయే శూరో ధర్మాచరతి పండితః
> హిత ప్రయోక్తిభిః వక్త దాతా సన్మాన దానతః
> భావం:
> రణభూమి లో గెలుచినంత మాత్రం శూరుడు కాలేడు, గ్రంధాలు చదివినంతమాత్రాన పండితుడు కాలేడు, అనర్గళంగా మాట్లాడినంత మాత్రాన వక్త కాలేడు, ధనం ఇచ్చినంత మాత్రాన దాత కాలేడు.
> ఇంద్రియములను జయించినవాడు శూరుడు, ధర్మాన్ని ఆచరించేవాడు పండితుడు, హితోక్తులు చెప్పేవాడు వక్త, గౌరవంగా సహాయం చేసేవాడు దాత.
######################
అనువాదపద్యము:
శా॥
*పోరాటమ్మున గెల్వ శూరుడగునే? స్పూర్తిన్ జితేంద్ర్యుండెపో*
*ఆరాటమ్మున విద్య గొన్న బుధుడే? యా ధర్మబద్ధుండెపో*
*భూరిన్ మాటలు చెప్ప వక్త యగునే? ప్రోద్యద్ధితోక్తుండెపో*
*కారుణ్యమ్మున విత్తమీయ ప్రదియే? కాంక్షించి పూజించకన్*
----------------------------------------------------
మగడు=శూరుడు; ప్రది=దాత; పూజించు=గౌరవించు;
----------------------------------------------------
~"కవితాభారతి"
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి