28, జనవరి 2025, మంగళవారం

🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


     59వ దివ్యదేశము 🕉


🙏శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం 🙏


తిరువనంతపురం. ( Trivandrum). కేరళ.


💠 ప్రధాన దైవం పేరు : శ్రీ అనంత పద్మనాభస్వామి 

💠 ప్రధాన దేవత :శ్రీహరిలక్ష్మీతాయార్

💠 పుష్కరిణి : మత్స్య పుష్కరిణి 

💠 విమానం : హేమకూట విమానము .


🌀  స్థలపురాణం 🌀


💠అనంతునిపై శయనించిన పెరుమాళ్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో , పద్మము యొక్క రేకుల వంటి నేత్రములతో మహా శోభాయమానముగా దర్శనమిచ్చు చుండుటచే అనంత పద్మనాభ స్వామిగా ప్రసిద్ధి నొందెను . 

పెరుమాళ్ మూర్తి నిడివి 18 అడుగులు .

 

💠 బిళ్వ మంగళ స్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై యుండెను . అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపము ప్రత్యక్షమునిచ్చెను.

అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమయినా పెరుమాళ్ కు నివేదించ వలయునన్న తపనతో ఇటునటు చూచి , పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమియు లేక పోయినందు వలన ప్రక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలనుంచి స్వామికి అర్పించెను .

 ఈ ఆలయమున ఇప్పటికినీ అది ఆచారముగా కొనసాగించుచున్నారు . 

కాని పచ్చి మామిడి కాయల ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదించుచున్నారు . నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికినీ సుప్రభాత సేవ చేయుదురు . 


💠 ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి.  అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.


💠ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. 


💠 అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం.

 ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. 

 

💠 నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. 

 

💠ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి.


🙏జై శ్రీమన్నారాయణ 🙏

కామెంట్‌లు లేవు: