8, డిసెంబర్ 2023, శుక్రవారం

సుభాషితం

 *జైశ్రీరామ్*


                              31-5-2020

                              అభ్యాసం-21


                            *సుభాషితం*


"అన్న గ్రహణకె సమయేమే

  విచారు మన్ మే కర్నాహై

  కిస్ హేతూసే ఇస్ శరీరుకా

  పాలన్ పోషన్ కర్నాహై |

  హే పరమేశ్వర్ ఏక్ ప్రార్ధనా

  నిత్య తుమ్హారే చరణోంమే

  లగ్జాయే తన్ మన్ ధన్ మేరా

  మాతృభూమికీ సేవామే"||


                                *భావం*


ఆహారం తీసుకొనే సమయంలో మనసులో ఒక ఆలోచన చెయ్యాలి. నేను ఆహారాన్ని దేనికోసం తీసుకుంటున్నాను.కేవలం ఆకలి తీర్చుకుని, కడుపు నింపుకుని ఈ శరీరాన్ని పోషించటం కోసమేనా లేక అంతకుమించి ఏమైనా ఉందా! అప్పుడు అనిపిస్తుంది కేవలం దానికోసమే కాదు అని .

      అప్పుడు భగవంతుని ఇలా ప్రార్ధించాలి.ఓ పరమేశ్వరా! నా శరీరము,మనసు, ధనము (తన్ మన్ ధన్) మాతృభూమి సేవకు ఉపయోగపడేలా చెయ్యి.అదే నా కోరిక.


                         *అమృతవచనం* 


పరమ పూజనీయ *గురూజీ* ఇలా అన్నారు:

వ్యక్తి సంతత వ్రత, సాధనాలద్వరా తనను తాను ఉద్ధరించుకోవాలి.తన్ను తాను ఉద్థరించుకోలేనివాడు ఇతరులను ఉద్ధరించటమనేది దుష్కర మయిన విషయం.ఉత్తమకార్యం చేయడానికి పూనుకున్నవాడు తాను చేపట్టిన కార్యంపట్ల వైమనస్యాన్ని కలిగి ఉండరాదు.మాటవల్లనే మిత్రత్వం వస్తుంది.మాటవల్లనే శతృత్వం వస్తుంది.అందువల్ల వ్యక్తి ఎప్పుడూ వాక్ నియమాన్ని పాటించాలి.అంతేకాదు సర్వలోక మనోహరమైన మధుర వాక్కును అలవర్చుకోవాలి.విరోధులైన వారిలో మార్పు తీసుకొనిరావాలంటే వారితో యుక్తియుక్తంగా మాట్లాడాలి.సౌమ్యంగా మాట్లాడాలి.స్వానుభవ పూర్వకమైన ప్రమాణాలు చూపిస్తూ మాట్లాడాలి.

      పెద్దలను తండ్రివలె, స్త్రీలను తల్లివలె,సమవయస్కులను సోదరులవలె, బాలురను-శిశువులను పుత్రులువలె మన్నించాలి.ఇతరుల కార్యాన్ని తన సొంతపనిగా పూనుకొని చేసిపెట్టాలి.

       ఒక్కడే కూర్చుని భుజించకూడదు, నలుగురితో కలిసి భుజించాలి.ఏకాంతంగా సమయాన్ని వ్యర్ధం చేయకూడదు.నలుగురితో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి.ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఉచిత వేషం ధరించి ఎప్పుడూ మందస్మిత వదనడై కనిపించాలి.హితముగా,మితముగా భుజించాలి.మంచివాళ్ళతో స్నేహం చేసి సత్సాంగత్యాన్ని వృద్థిపరచుకోవాలి.పరోపకారాన్ని పరమ ధర్మంగా, ప్రయత్నాన్ని దైవంగా,సౌశీల్యాన్ని తోడునీడగా భావించాలి.సచ్ఛీలుడైన వ్యక్తికి ప్రేమ మరణ పర్యంతం ఉండాలి,క్రోధం క్చణకాలం ఉండాలి, ద్వేషం అసలు ఉండకూడదు.


                      శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

కామెంట్‌లు లేవు: