వాలుకుర్చి (కవిత )
_________________________
-లలితా చండీ
రాజుగారి ఇంట్లో
రాజసంగా వెలిగిన కుర్చీ
పెద్ద వారి హోదాలకు
దర్పంగా నిలిచిన కుర్చీ
పాత తరానికి గుర్తుగా
తాతగారికి ఇష్టమైనది
కొత్తతరం కూర్చో లేనంతగా మెరిసిన కుర్చీ
కళ్లజోడు సరి చేసుకొంటూ
వార్తాపత్రిక చదివేది,
తాతగారు కూర్చోని
పిల్లలకు పాఠాలు చెప్పే
తీయని స్మృతులకు నెలవైనది
కుర్చీ కర్ర తీసేసి
ట్యూషన్ మాస్టర్ ని పడెేయాలని
అమ్మమ్మ చూసేలోగ
కర్ర దాచేసే
ఆకతాయి పిల్లలకు
ఆ కర్రతోనే
దెబ్బలకు అనువైనది
అలసివచ్చిన నాన్న
సేదతీరేందుకు సుళువైనది
అమ్మ ఇచ్చే కాఫీతో
అపూర్వమైన దృశ్యమైంది
చాలా కాలం హాలులో
ఆపై వరండాలోకి చేరి
తరువాత స్టోర్ రూమ్ లోకి
మారిపోయింది
కాలాంతరంలో కొత్త రూపంలో
దర్శనం ఇచ్చిన ఓ వాలు కుర్చీ!
మా జ్ఞాపకాల మడతలలో
ఎప్పటికీ నువ్వు
మడత కుర్చీవేగా!
🔴🟢🟣
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి