🎻🌹🙏నాయనమ్మ_ఉవాచ
ఒరేయ్ అలా మడి ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏంటిరా ఆ అప్రాచ్యపు పనులు..
🔸 చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా.
🔸 బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కొరా
🔸 స్తానం చేసిన తరువాత మాత్రమే తిను
🔸 బయట తిరిగి వచ్చిన తరువాత స్థానం చేసి , వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రా
🔸 ఉతకని బట్టలు కట్టు కోవద్దు
🔸 ఏదైనా తినే ముందు చేతులు కడుక్కో
🔸 ఎవర్ని బడితే వాళ్ళని తాకి , వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు
🔸 శాఖాహారం మాత్రమే తిను
🔸 కుక్కల్ని , పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు
🔸 బయట వండినవి , నిన్న వండినవి తినకు , వేడిగా ఉన్నప్పుడే తిను
🔸 మడి కట్టుకొని వండు , నేను వంట చేస్తు న్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు
🔸 పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు
🔸 పాత్రలు ఎండలో బోర్లా పెట్టు
🔸 శవాన్ని ముట్టు కోవద్దు , చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రెండు వారాలదాకా ముట్టుకోవద్దు, వారితో తిరగ వద్దు
ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం.
ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చాదస్తం పట్టుకుంది.
హిందూమతం కాదు మనది హిందూధర్మం, సనాతనధర్మం సనాతనవేదం..
👏👏🌷🌹🙏🌹🌷👏👏
🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి