13, అక్టోబర్ 2020, మంగళవారం

గాయత్రి శక్తి

 🌷గాయత్రి శక్తి🌷(శాప విమోచన మంత్రం)


చాలా కాలం క్రితం ఒక కలెక్టర్ గారి కి కార్య నిర్వహణలో ఒకరితో గొడవ జరిగింది వారు కక్ష కట్టి ఎలాగైనా అతన్ని చంపాలి అని ఒక క్షుద్ర మంత్రికుడిని ఆశ్రయించారు.. వారిపైన ప్రయోగం చేశారు.. ఆ క్షుద్ర శక్తి కలెక్టర్ గారి ఇంటి పైకి వచ్చింది అయితే ఆ ఇంటి గుమ్మం ముందు తలుపుకి అడ్డంగా ఒక గుమ్మస్తా నిద్రపోతున్నారు అతన్ని దాటి ఆ క్షుద్ర ప్రయోగ శక్తి ఇంట్లోకి ప్రవేశించ లేక పోయింది చాలా ప్రయత్నాలు చేస్తూ వికృతంగా అరుపులు గాలి అక్కడ వస్తువులు చిందరగా గాలికి ఎగురుతున్నాయి అక్కడే నిధురిస్తున్న ఆ బ్రాహ్మణుడు లేచి చూసి పరిస్థితి అర్తం చేసుకుని భయపడకుండా కలెక్టర్ గారిని బయటకు రాకండి అని చెప్పి వారించారు వారికి ధూళితో సుడి గుండాలి తిరుగుతూ కనిపిస్తుంది లోపలి నుండి.. ఈ గుమస్తా గా ఉన్న బ్రాహ్మణుడు గాయత్రి ఉపాసకుడు నిత్యం గాయత్రి జపిస్తూ ఉంటారు వారి గాయత్రి జప శక్తి ముందు ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేక వారిని దాటి రాలేక దాని ప్రయోగం చేసిన వారి వద్దకే తిప్పి కొట్టింది ఇది కృత్యా ప్రయోగం.. దాని ఉపసంహరణ అప్పటికప్పుడు ప్రయోగించిన వాడు కూడా చేయలేడు అటువంటిది ఆ గాయత్రి శక్తి తట్టుకోలేక ప్రయోగించిన వారిని మింగింది కృత్య ప్రయోగం అంతే ఎవరి పైకి అయినా ప్రయోగించి నప్పుడు అది వారు తిప్పి కొట్టగలిగితే పంపిన వారినే మింగుతుంది.. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన ఆ కలెక్టర్ బయటకు వచ్చే సరికి ఆయన జంధ్యం పట్టుకుని ఆపకుండా గాయత్రి జపిస్తూనే ఉన్నారు వెంటనే అతని కాళ్ళ పైన పడి గుమస్తాగా చూసి నందుకు క్షమాపణ అడిగారు అతను నిజాయితీగా అయ్యా ఇది నా వృత్తి నా కర్తవ్యం.. నా ఉద్యోగ ధర్మం ఇందులో మీరు చేసింది ఏముంది అని వారిని లోనికి పంపి వారి జపం కొనసాగించారు గాయత్రి శక్తిని కళ్లారా చూసిన కలెక్టర్ కూడా గాయత్రి ఉపాసన మొదలు పెట్టారు ఇది కథ కాదు యదార్థంగా జరిగిన సంఘటన... ఇది ఒక ఉదాహరణ..


ఇంకో జరిగిన విషయం తెలుసుకుందాము.. ఒక బ్రాహ్మణుడు గాయత్రి నిత్య ఉపాసకుడు వారికి ఒక ప్రత్యంగిరా కృత్యా ప్రయోగం చేసే ఉపసకుడితో పరిచయం ఏర్పడింది కొద్ది రోజులు స్నేహం బాగానే నడిచింది తర్వాత మనస్పర్థలు మాట మాట పెరగడం నువ్వెంత అంటే నువెంత అనుకోవడం నిన్ను ఏమీ చేస్తానో చూడు అని ఆ గాయత్రి ఉపాసకుడి పైన కృత్యా ప్రయోగం చేసాడు అదే రాత్రి కృత్య వచ్చి గుండెల పైన అదిమి నెత్తురు కక్కేలా తొక్కి ప్రాణం పోయింది ఈయన గాయత్రి ఉపాసకుడు కానీ తనకు తాను రక్షించు కోలేక పోయారు..


ఇప్పుడు ఈ రెండు కథలు విన్నారు కదా యదార్థంగా జరిగినవే వాస్తవానికి గాయత్రి ఉపసాకులు పైన ఏ మంత్రం ప్రయోగం చెడు జరగదు మరణించిన వ్యక్తి కొన్ని లక్షల్లో జపం చేస్తూ ఉండే గాయత్రి ఉపాసకులు నిజానికి ప్రయోగించిన వాడి ప్రాణం పోవాలి కానీ ఇతనికే ముప్పు కలిగింది.. దీనికి కారణం ఏంటి ఎక్కడ పొరబాటు జరిగింది..


ఇద్దరూ గాయత్రి ఉపసాకులు అయిన ఒకరికి పనిచేసి ఒకరికి ఆ ప్రభావం చూపలేదు అంటే కారణం గాయత్రి జపం సాధనకు ముందుగా శాప విమోచన మంత్రం జపించి గాయత్రి జప సాధన చేయాలి.. అది నియమం అది తెలియక కొందరు కొన్ని లక్షల్లో జపం చేస్తూ ఉంటారు.. ఆ శాప మంత్రాలు ఇక్కడ ఇస్తాను మీరు అనుభవం గల గాయత్రి ఉపాసకులను కలిసి ఈ శాప విముక్తి విధానం. కూడా గ్రహించి ఆ విధంగా ముందు ఈ శాంతి జపము చేసి తర్వాత గాయత్రి చేయండి ఆ తల్లి మంత్ర శక్తి ఏంటో అనుభవ పూర్వకంగా చూడండి..


1.బ్రహ్మశాపవిమోచన మంత్రములు


 అస్య శ్రీ బ్రహ్మశాపవిమోచన మంత్రస్య నిగ్రహాను గ్రహకర్తా . ప్రజాపతి ఋషిః | కామదుఘా గాయత్రీ ఛందః | బ్రహ్మశాప విమోచనీయ గాయత్రీశక్తి:ప్రజా సవితాదేవతా | బ్రహ్మ శాపవిమోచనార్దే జపే వినియోగః


*మంత్రము* : సవితుర్భహ్మామేత్యుపాసనాతద్ర్బహ్మవిదో విదుస్తా ప్రయతంతిధీరాః | సుమనసావాచాయ మాగ్రతః బ్రహ్మశాసాద్విముక్తాభవ.


2.విశ్వామిత్ర శాప విమోచన మంత్రము 


అస్య శ్రీ విశ్వామిత్ర శాపవిమోచన మంత్రస్య నూతన సృష్టికర్తా విశ్వామిత్ర ఋషిః వాగ్గుఘాగాయత్రీఛందః | భుక్తిముక్తి ప్రదావిశ్వామిత్రానుగృహీతా గాయత్రీ శక్తిః | సవితా దేవతా | విశ్వామిత్రశాపవిమోచనార్దే జపే వినియోగః ||


*మంత్రము* తత్వాని చాంగేష్వగ్ని చితోధియాంసః | త్రిగర్భాంయదుద్భవాందేవాశ్శోచిరే ఎవ్వసృష్టించాం కళ్యాణీం సృష్టికరీం ప్రపత్యయమ్మ ఖాన్నిసృతో వేదగర్భః || ఓం గాయత్రీత్వం విశ్వామిత్ర శాపాద్విముక్తాభవ ||


3.వసిష్ట శాప విమోచన మంత్రము

వసిష్ట శాపవిమోచన మంత్రస్య, వసిష్ఠఋషిః

విశ్వోద్భవా గాయత్రీ ఛందః |

వశిష్టాను గ్రహీతా గాయత్రీశక్తిః | సవితాదేవతా | వసిష్ఠ శాప విమోచనార్దే జపే : వినియోగః 


*మంత్రము* : తత్వానిచాంగేష్యగ్ని చితోధియాంసః, ధ్యాయనివిష్ణోరా యుధానిబిభ్రతే జనానతో శో పరమంచశశ్వత్ | గాయత్రీ మాపాచ్చుర సుత్త మంచధామ | ఓం గాయత్రి వసిష్ట శాపాద్విముక్తాభవ 


'అహ మార్కం మహజ్యోతి రర్కజ్యోతి రహం శివః | 

ఆత్మజ్యోతిహం శుక్తం శుక్ల జ్యోతిర సోహమోం | 

'అహో విష్ణు మహేశేశే దివ్యసిద్దే సరస్వతి |

'అజరే అమరేచైవ దివ్యయోనే నమోస్తుతే ||


ఈ బ్రహ్మశాప, విశ్వామిత్రశాప, వసిష్ఠ శాప మంత్రములను ముందుగా జపము చేసి, శాపనివృత్తమైన పిమ్మట గాయత్రీ మంత్రమును యధాశాస్త్రీయముగా పురశ్చరణము చేసిన యెడల గాయత్రీ మంత్ర యంత్రములు తప్పక సిద్దించును. పూర్వమొకప్పుడు గాయత్రీదేవి మంత్రమునకు బ్రహ్మ, విశ్వామిత్రుడు, వసిష్టుడు శాపము నిచ్చియున్నారు. కనుక ఈ శాపవిమోచన మంత్రములను జపము చేయకుండా గాయత్రీ మంత్రమును

"శత లక్షం ప్రజాస్వాపి గాయత్రీ నచసిద్ధ్యతి” 

అను న్యాయాను సారము నూరు లక్షల జపించినను ఫలించదు అను రహస్యమును అందరూ తెలుసుకోవాలి..


🙏ఓం శ్రీ మాత్రే నమః🙏


ఇలాంటి వన్నీ తెలుసుకోకుండా చేయాకుడదు అనే కొన్ని మంత్రాలు సాధనలు ఉపదేశం లేకుండా చేయాకుడదు అంటారు.. అయితే ఈ రెండు కథలు తెలిసిన తర్వాత దీనికి కారణం తెలుసుకోవాలి అని ఎంతో ప్రయత్నం చేసాను ఎందరో గాయత్రి జపిస్తున్న వాళ్ళాను అడిగాను వాళ్లకు కూడా ఇది తెలియలేదు చాలా మంది ఇది చేయకుండానే జపం మొదలు ఐపోతుంది . ఒక సంస్కృత గ్రంధంలో గాయత్రి ఉపాసన విధానంలో ఈ విషయం వివరంగా లభించింది.. జప క్రమంలో ఒక్కో బీజాన్ని ఎలా జపం చేయాలి అలా 24 బీజాలతో సాధన ఎలా చేయాలి తర్వాత పూర్తిగా కలిపి ఎలా చేయాలి , గాయత్రి మంత్ర శక్తిని ఎలా ప్రయోగించాలి , వారికి బ్రహ్మాది రుద్రులు విష్ణువు తో తగిన శక్తిని కూడా పొందగలరు అని ఎంతో గొప్పగా వర్ణించ బడినది.. మహాద్భుతం శ్రీ గాయత్రీ శరణం మమ... ఆ తల్లి ఉపాసకులకు ఈ సందేశం ఇవ్వాలి తెలియని వారికి ఉపయోగ పడాలి అని ఈ వివరణ ఇవ్వడం జరిగింది.


                               ఇట్లు 

                                  మీ

                  అవధానుల శ్రీనివాస శాస్త్రి

కామెంట్‌లు లేవు: