శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
నీవే తల్లియు దండ్రియున్; గురుడవున్ నీవే; శివా చుట్టమున్
నీవే ! రోగముమాన్ప వైద్యుడరయన్ నీవే; మహా దాతవున్
నీవే, త్రాతవు నీవె; దైవమనగన్ నీవే; త్రిలోకమ్ములున్
శ్రీ విద్యానిధి ! నీవయంచుదలతున్ శ్రీ సిద్దలింగేశ్వరా!
భావం;
నువ్వే నా తల్లి,తండ్రి.నా గురుడవు కూడా నువ్వే! ఓ శివా నా బంధువు, రోగాన్ని మాన్పేటువంటి వైద్యుడు కూడా నువ్వే!
నాకు దానమొనర్చేది నువ్వే, నన్ను ఆపదలనుండి రక్షించేవాడివి నువ్వే!మూడు లోకాల
ధర్మార్థకామములను నేర్పే ఒక మహా విద్యా విశేషానికి నిధి వంటి వాడివీ నువ్వే!అని పరిపూర్ణంగా నమ్ముతున్నాను స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి