*జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*
మన కోర్కెలు తీర్చే భగవంతుని సర్వశక్తి స్వరూపంగా, గుణపూర్ణునిగా కొలవడం సహజం. నిర్గుణుడు, నిరాకారుడు మనకు ఏమి ఇవ్వగలడు? లోకానికి కల్యాణం కలిగించేవాడే భగవంతుడు.
భగవంతుని భార్య, ఆయన దివ్య స్వభావానికి ప్రతీక. భగవానుని ప్రక్కన అమ్మవారు ఉండవలసిన అవసరం ఆయనకంటే మనకే ఎక్కువ. ఎందుకంటే భగవానుని మనం ఆశ్రయించినపుడు ఆయన కాదనకుండా మనల్ని అనుగ్రహించాలంటే ప్రక్కన అమ్మవారుండాలి.
ఆమె బిడ్డలమైన మన మీద ఆమెకు సహజసిద్ధంగా వాత్సల్యం ఉంటుంది. అంతేనా *నిత్య మజ్ఞాత నిగ్రహాం* ఆమె ఎప్పుడూ కోపమనేది ఎరగదు. భగవంతుడికి మన మీద అనుగ్రహంతో పాటు ఆగ్రహం కూడా వస్తుంటుంది. ఆ సమయాల్లో అమ్మ స్వామి ప్రక్కన ఉంటే స్వామి ఆగ్రహాన్నుండి మనల్ని కాపాడుతుంది.
*విష్ణో రే షానపాయి నీ, దేవత్వే దేవ దేహేయం మనుష్య త్వేచ మానుషీ* భగవానుడు దేవుడుగా అవతరిస్తే మానవిగా, ఈమె కూడా అవతరిస్తూ, మనల్ని రక్షించడం కోసమే, స్వామిని ఎడబాయకుండా ఉంటుంది.
భగవంతుని ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులే అమ్మవార్లని గ్రహించాలి. స్వామితో అమ్మ కల్యాణం లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది. దేవుడి కల్యాణాలు చేయించే మానవుల కోర్కెలు తీరి, వారికి సర్వశుభాలు కలుగుతాయి. లోకం ఆనందధామం అవుతుంది.
*శుభంభూయాత్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి