13, అక్టోబర్ 2020, మంగళవారం

వధూవరులకు సఖ్యత

వధూవరులకు సఖ్యత కలదా ? లేదా యని నిర్ణయించుటకు ఇరువది(20) వింశతి వర్గుల ద్వారా నిర్ణయింపవలసియున్నది. (కొందరు 12 గాను, మరికొందరు 8 గాను తెల్పియున్నారు.

వీటి యందు ఆరు మరీ ముఖ్యమని చెబుతారు. అవి

1. నాడీ కూటము

2.రాశివర్గు

3. గ్రహమైత్రి 

4. యోని

5. స్త్రీ ధీర్ఘ వర్గు

6. గణకూటమి .

ప్రస్తుత చర్చ నాడీ కూటము గురించి నా పరిధిలో వివరణ:


4 పాదములు గల నక్షత్రములందు జన్మించిన వధువు(కన్య) కు 

27 నక్షత్ర ములను వరుసగా 3 భాగములుగా విభజించిన యెడల 

వధూ వర నక్షత్రములు అందే ఒక్క భాగమునందైనను కల్గియుండుట దోషము.

వధూ నక్షత్రము ఒక భాగమునందు 

వరుని నక్షత్రం మరియొక భాగమునందు ఉండుట శ్రేయస్కరము.


ఇదే విధముగా 3 పాదములు గల నక్షత్రం నందు జన్మించిన కన్యక విషయంలో కృత్తిక మొదలు నక్షత్రములన్నియు 4 భాగములు చేయవలెను.


అలాగే 2 పాదములు గల నక్షత్ర జాతకు రాలి విషయంలో మృగశిర మొదలు నక్షత్రమలన్నీ వరుసగా 5 భాగములు గావించాలి.

అట్టి భాగములందు ఇరువురి నక్షత్రములు ఒక భాగమునందు లేకుండా చూచుట మంచిది. 


ఒకే భాగమునందు ఇరువురి నక్షత్రములున్న

యెడల వారికి నాడీ కూటమి రీత్యా దాంపత్యము పొసగదు.


పై విధముగా నాడీ కూటము సరిగా లేని యెడల అనగా ఇరువురి నక్షత్రాలు ఒకే భాగము నందుండుట దోషప్రదము.


🏵 అయితే రాశికూటము, రజ్జు కూటములు రెండునూ శుభప్రదముగా ఉన్నను లేక

వీరిరు వురి జన్మరాసులకు ఒకే గ్రహము అధిపతి అయైవున్నను లేక వీరి జన్మరాశ్యాధిపతులుగు గ్రహములు పరస్పరము మిత్రులైనను -నడీకూట దోషపరిహారము కాగలదు. అనగా

నాడీకూటము సరిలేనప్పటికీ పై విధముగా ఇతర వర్గులు బాగున్న యెడల వారివురికీ 

వివాహ ము యోగ్యముగా ఉండగలదు.🏵

🙏

కామెంట్‌లు లేవు: