13, అక్టోబర్ 2020, మంగళవారం

సద్దర్శనము

 అరుణాచల శివ 🙏


🍁🍁🍁🍁🍁🍁🍁



' సద్దర్శనము - సద్విద్య' (ఉన్నది నలుబది)

        - భగవాన్ శ్రీ రమణ మహర్షి



శ్లోకం: 15


 సత్య శ్చిదాత్మా వివిధాకృతి శ్చిత్

 సిద్ధ్యేత్ పృథక్ సత్యచితో న భిన్నా l

 భూషావికారాః కిము సన్తి సత్యం

 వినా సువర్ణం పృథ గత్ర లోకే ll15!!* 



జ్ఞాన స్వరూపమైన ఆత్మ సత్యము. అది ఒక్కటే. నానా విధములైన జ్ఞానములు ఏకమైన ఆ సత్యజ్ఞానస్వరూపము కంటె భిన్నములు కావు. 


 ఈ ప్రపంచమునందు సత్యము ఉపాదానమైన బంగారముకంటె వేరుగా భూషణములు లేవు.


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏


🍁🍁🍁🍁🍁🍁🍁

అరుణాచల శివ🙏


🍁🍁🍁🍁


మనసులో ఏ కోరిక లేనప్పుడు మనసు ఎలా ఉంటుంది !??_




కోరిక చేత నా మనసును, మరొక గుణం ఆవరించిందని గుర్తిస్తే, అది లేని మనసు ఎలా ఉంటుందన్న శోధన మొదలవుతుంది. 


ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ మనం ఏదో ఒకటి కోరుతూనే ఉన్నాం.


 మనం దేన్ని కోరుతున్నామో ఆ గుణంగా ఉంటున్నాం. 


ఇక మనం మనంగా ఉంటున్నది ఎక్కడ ? నిద్రలో మనం మనంగా ఉంటున్నాం. 


కానీ ఆ మత్తులో అది మనకు తెలియటం లేదు.


 ఒక వ్యక్తి మద్యం దుకాణం ముందు నుండి వెళుతున్నాడు.. కానీ అతడికి ఆ మద్యం ధ్యాస రాలేదు.

 అప్పుడు అతడు అతడిగానే ఉన్నాడు. 


కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక స్వీట్ షాప్ కనిపించింది. స్వీట్ తినాలనిపించింది. ఇప్పుడతడు తన గుణంతో కాక కనిపించే వాటి గుణంగా ఉన్నాడు. 


విషయం ఏదైనా ఒకదాన్ని కోరుకోవడం అంటే అది గుణం చేతనే. 


అలా కోరుకుంటున్నప్పుడు మనం ఆ గుణంతో ఉండి మన గుణాన్ని మరుగునపెడుతున్నాం. 


ఏదో కావాలనుకోవటం కోరిక. అది ఏదైనా కానీ, చివరికి ప్రయోజనాన్ని ఆశించి చేసే పూజ, జపం, ధ్యానం ఏదైనా సరే అది కోరికే అవుతుంది !


---శ్రీరమణీయం నుండి...


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: