13, అక్టోబర్ 2020, మంగళవారం

🍁విద్య🍁

 🍁విద్య🍁


🍁విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్‌

విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్‌

విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్‌

విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే?!🍁


🌴డబ్బు బాగా ఎక్కువైన వాళ్లు ఇంట్లో పాలరాళ్ల కింద దాస్తున్నారట. ఈ మధ్యకాలంలో పేపర్లలో వార్తల్లో చదువుతున్నాం. ధనాన్ని దాచుకోవాలి. 


🌴విద్యను దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ కనిపించని నిగూఢ ఐశ్వర్యం. 


🌴జ్ఞానం కలిగి ఉన్న వాళ్ల ముఖం చూడండి ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. 


🌴విద్య వల్ల తేజస్సు వస్తుంది. 


🌴మంచి కీర్తి లభిస్తుంది. 


🌴విద్యావంతులు భోగాలు అనుభవిస్తారు. 


🌴విద్యే గురువు! 


🌴విదేశాలు వెళ్లినా విద్యే బంధువు! 


🌴విద్యను అందరూ దైవంగా భావిస్తారు. 


🌴విద్యకు సరిసమానమైన ధనం లేదు. 


👉ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడైనా, ఏ రాజైనా విద్యావంతుడిని గౌరవిస్తారు. అంత గొప్పది విద్య!!🍁

కామెంట్‌లు లేవు: